
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేదల బాధలు తెలుసుకాబట్టే తమకు అండగా ఉన్నారని ఒడిస్సా వలస కూలీలు అన్నారు. ప్రత్యేకంగా ఒడిస్సా రాష్ట్రానికి బస్సులు వేసి తమను పంపిస్తున్న సీఎం వైస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ పునరావాస కేంద్రం నుంచి 9 బస్సుల్లో 283 ఒడిస్సా వలస కూలీలను సొంత రాష్ట్రానికి పంపించారు అధికారులు. ఈ సందర్భంగా ఒడిస్సా వలస కూలీలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇంటికి వెళ్లాలన్న ఆత్రుతతో మా రాష్ట్రానికి నడుచుకుంటూ బయల్దేరాం. దారిలో తాగడానికి నీళ్లు తినటానికి తిండి లేక అనేక ఇబ్బందులు పడ్డాం. ( వలస కూలీలపై కరోనా పంజా )
ఒక చేత్తో బిడ్డలను మరొక చేత్తో లగేజీని మోసుకుంటూ నడక మొదలుపెట్టాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. పునరావాస కేంద్రాల్లో మాకు అద్భుతమైన భోజనాలు పెట్టార’’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment