లక్నో: లాక్‌డౌన్ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలను మృత్యువు పలకరించింది. అయిన వారిని చూడకుండానే అనంతలోకాలకు చేర్చింది. ఈ విషాదకర సంఘటన కాన్పూర్ - ఝాన్సీ హైవేపై చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు వలస కూలీలు ఉపాధి కోసం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు దొరకకపోవడంతో సొంత ఊరికి ప్రయాణమయ్యారు.
దాదాపు 54 మంది ఓ ట్రక్కులో బయలు దేరారు. వలస కూలీల ట్రక్కు కాన్పూర్ - ఝాన్సీ హైవే మీద ఉండగా మరో ట్రక్కు వచ్చి దీన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పెద్దలతో పాటు ఓ చిన్నారి మరణించగా.. 43 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిని కాన్పూర్‌లోని లాలా లజపతి రాయ్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment