మీరు దిగిపోండి! | Arunachal Pradesh governor JP Rajkhowa reportedly asked to step down | Sakshi
Sakshi News home page

మీరు దిగిపోండి!

Published Sun, Sep 4 2016 10:27 AM | Last Updated on Mon, Aug 20 2018 5:23 PM

మీరు దిగిపోండి! - Sakshi

మీరు దిగిపోండి!

అరుణాచల్ గవర్నర్‌ను కోరిన కేంద్రం?

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రకాష్ రాజ్‌ఖోవాను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా కేంద్రం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పి మీరు పదవి నుంచి తప్పుకోండి’ అని కేంద్ర హోం శాఖ అధికారి, సహాయ మంత్రుల నుంచి గవర్నర్‌కు ఫోన్లు వచ్చాయని తెలిసింది. ఫోన్లు వచ్చాక రాజ్‌ఖోవా స్పష్టత కోసం హోం మంత్రి రాజ్‌నాథ్‌ను సంప్రదించగా పదవి నుంచి దిగిపోవాల్సిందిగా రాజ్‌నాథ్ చెప్పలేదని విశ్వసనీయవర్గాల సమాచారం.

రాష్ట్రంలో టుకీ ప్రభుత్వాన్ని కూలదోసి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కలిఖోపుల్ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కలిఖోపుల్ ప్రభుత్వ ఏర్పాటు చెల్లదనీ, నబం టుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఈ మధ్యనే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement