సాక్షి, న్యూఢిల్లీ : పారామిలటరీ బలగాల్లో దాదాపు 84,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) 9,99,795 పోస్టులు మంజూరు కాగా ఏటా వివిధ గ్రేడుల్లో పది శాతం ఖాళీలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రస్తుతం 84,037 పోస్టులు భర్తీ చేసేందుకు ఖాళీగా ఉన్నాయని హోం శాఖ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంది.
కాగా, సీఆర్‌పీఎఫ్‌లో 22,980 ఖాళీలు, బీఎస్‌ఎఫ్‌లో 21,465, సీఐఎస్‌ఎఫ్‌లో 10,415, ఎస్‌ఎస్‌బీలో 18,102, ఐటీబీపీలో 6643, అస్సాం రైఫిల్స్‌లో 4432 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. నూతనంగా ఏర్పడిన పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం సత్వర చర్యలు చేపడుతుందని పేర్కొంది. రిక్రూట్‌మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్‌ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment