ఏపీకి 16.. తెలంగాణకు 14 పోలీసు మెడల్స్‌ | Ministry of Home Affairs Announces Police Medals To AP And Telangana | Sakshi
Sakshi News home page

ఏపీకి 16.. తెలంగాణకు 14 పోలీసు మెడల్స్‌

Published Fri, Aug 14 2020 1:59 PM | Last Updated on Fri, Aug 14 2020 5:31 PM

Ministry of Home Affairs Announces Police Medals To AP And Telangana - Sakshi

ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి 16 మంది‌, తెలంగాణ నుంచి 14 మంది మెడల్స్‌ అందుకోనున్నారు. ఏపీకి వచ్చిన 16 పతకాల్లో.. రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్‌ పోలీసు మెడల్స్‌, 14 ఉత్తమ సేవా పోలీసు మెడల్స్‌ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు.

తెలంగాణ నుంచి పురస్కారానికి ఎంపికైన వారు..

  • రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు
  • మనసాని రవీందర్ రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్
  • చింతలపాటి యాదగిరి
  • శ్రీనివాస్ కుమార్ ఏసీపీ సైబరాబాద్
  • అడిషనల్ కమాండెంట్ మోతు జయరాజ్ వరంగల్
  • డబ్బీకార్ ఆనంద్ కుమార్ డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్
  • బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
  • కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్
  • సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్
  • మల్కాజ్‌గిరి ఎస్ఐ షేక్ సాధిక్‌ అలీ

ఏపీ అడిషనల్‌ డీజీపీ రవిశంకర్‌తో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కుమార్ విశ్వజిత్‌ ప్రెసిడెంట్ పోలీసు మెడల్‌ అందుకోనున్నారు. కాగా కేంద్ర హోంశాఖ వివిధ రాష్ష్ర్టాల నుంచి ఉత్తమ సేవలందించిన  215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌కు, 80 మందిని ప్రెసిడెంట్‌ పోలీస్‌ మెడల్‌కు​ , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement