president police Medal
-
ఏపీ పోలీసులకు పతకాల పంట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి చెందిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రైనింగ్ పి.వెంకట్రామిరెడ్డి సేవలను గుర్తించిన కేంద్ర హోం శాఖ ఆయనకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ప్రకటించింది. ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. ఏపీకి చెందిన ఏఏసీ మండ్ల హరికుమార్కు పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీఎంజీ), జేసీ ముర్రే సూర్యతేజకు ఫస్ట్ బార్ టు పీఎంజీ, జేసీ పువ్వుల సతీష్‌కు పీఎంజీ ప్రకటించింది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శాంతారావు (ఎస్ఎస్జీ ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ), ఎస్ఐ వి.నారాయణమూర్తి (ఎస్ఐబీ, విజయవాడ)లకు పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. -
ఏపీకి 16.. తెలంగాణకు 14 పోలీసు మెడల్స్
ఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమసేవలందించిన పోలీసులకు కేంద్రహోంశాఖ మెడల్స్‌ను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా 2020 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 14 మంది మెడల్స్ అందుకోనున్నారు. ఏపీకి వచ్చిన 16 పతకాల్లో.. రెండు విశిష్ట సేవా ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్, 14 ఉత్తమ సేవా పోలీసు మెడల్స్ ఉన్నాయి. అదే విధంగా తెలంగాణలో ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. తెలంగాణ నుంచి పురస్కారానికి ఎంపికైన వారు.. రాచకొండ ఏసీపీ నాయిని భుజంగరావు మనసాని రవీందర్ రెడ్డి డీడీ ఏసీబీ హైదరాబాద్ చింతలపాటి యాదగిరి శ్రీనివాస్ కుమార్ ఏసీపీ సైబరాబాద్ అడిషనల్ కమాండెంట్ మోతు జయరాజ్ వరంగల్ డబ్బీకార్ ఆనంద్ కుమార్ డీఎస్పీ ఇంటెలిజన్స్ హైదరాబాద్ బోయిని క్రిష్టయ్య ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం కట్టెగొమ్ముల రవీందర్‌రెడ్డి డీఎస్పీ, హైదరాబాద్ సీఐ ఇరుకుల నాగరాజు, హైదరాబాద్ మల్కాజ్గిరి ఎస్ఐ షేక్ సాధిక్ అలీ ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్‌తో పాటు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కుమార్ విశ్వజిత్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్ అందుకోనున్నారు. కాగా కేంద్ర హోంశాఖ వివిధ రాష్ష్ర్టాల నుంచి ఉత్తమ సేవలందించిన 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్‌కు, 80 మందిని ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌కు , 631 మందిని విశిష్ట సేవ పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. Ministry of Home Affairs announces list of medal awardees to the police personnel on #IndependenceDay 2020. 215 personnel get Police Medal for Gallantry, 80 get President's Police Medal for Distinguished Service & 631 get for Police Medal for Meritorious Service. pic.twitter.com/qXI3cBieIb — ANI (@ANI) August 14, 2020 -
సీవీ ఆనంద్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో అంకితభావం, కఠోర శ్రమతో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులకు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం సేవా పతకాలు ప్రకటించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, సివిల్ సప్లయి కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు మెట్రో రైల్ విభాగంలో పనిచేస్తున్న అదనపు డీసీపీ ఏ బాలకృష్ణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం) దక్కిందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అదే విధంగా మరో 11మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. ఈ పతకాలు సాధించిన అధికారులకు వచ్చే ఏడాది ఆగస్టు 15న సీఎం చేతులు మీదుగా అవార్డులు స్వీకరించనున్నారు. పీపీఎం పొందిన వారు: చిక్కడ్పల్లి ఏసీపీ జే నర్సయ్య, ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, ఇంటలిజెన్స్ డీఎస్పీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, డీజీపీ సెంట్రల్ స్టోర్ డీఎస్పీ పాక గిరిరాజు, సీఐసెల్ ఇన్స్పెక్టర్ టీఆర్ రాజేశ్వర్లక్ష్మీ, గ్రేహౌండ్స్ ఆర్ఐ పాకంటి భూపాల్‌రెడ్డి, వరంగల్ సిటీ ఏఎస్ఐ బూర్గుల మహేందర్, కరీంనగర్ బెటాయలిన్ ఏఆర్ఎస్ఐ తూడి ప్రభాకర్, ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఎం రఘుపతిరావు, అంబర్పేట్ సీపీఎల్హెడ్కానిస్టేబుల్ ఎండీ ఖైరుద్దీన్, సీఐ సెల్ హెడ్‌కానిస్టేబుల్ పీ జీవానందం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు 67 సేవా పతకాలు లభించాయి. ఏపీ సేవా పతకాల్లో 52 పోలీసు శౌర్య పతకాలు, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి. ఏపీ నుంచి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నాయక్, కర్నూలు ఏఎస్పీ దొడ్లా నరహర, విజయనగరం ఏఎస్ఐ కొటూరి ప్రసాద్రావులకు రాష్ట్కపతి విశిష్ట సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. -
రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక
పోలవరం(టెక్కలి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ రక్షణలో విశిష్ట సేవ లు అందజేసినందుకు గా ను టెక్కలి మండలం పోల వరం గ్రామానికి చెందిన పి.వి. రమణబాబు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ యన ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కిరండోల్లోని బీఐఓఎ మ్లో క్రైమ్ అండ్ ఇంటెలిజె న్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1988 సంవత్సరంలో సిఐఎస్ఎఫ్లో విధుల్లో చేరిన రమణబాబు సుమారు 14 సంవత్సరాలు వివిధ రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ సెక్యురిటీ విభాగంలో పనిచేశారు. ఇప్పటివరకూ 80కు పైగా వివిధ అవార్డులు, రివార్డులు పొందారు. 2012 సంవత్సరంలో కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల మీదుగా డెరైక్టర్ జనరల్ డిస్క్‌ను అందుకున్న ఈయన ప్రస్తుతం రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యూరు. మార్చిలో దీన్ని అందుకోనున్నారు. -
పోలీసు పతకాలూ విభజన!
- ఉగాది పతకాలపై ఉత్కంఠ - ఎవరు ప్రదానం చేస్తారో తెలియక తికమక - ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు - ఇప్పుడు ఇచ్చేది ఎప్పుడో? సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రభావం పోలీసు పతకాల ప్రదానంపైనా పడింది. ఉగాది పండగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను ఎవరు? ఎప్పుడు? అందిస్తారనేది అవి దక్కించుకున్నవారికి అర్థం కావట్లేదు. ఈ జాబితాను ప్రకటిస్తూ మార్చి నెలాఖరులో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లోనూ వీటిపై ఎలాంటి ప్రస్తావనా లేదు. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులూ దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పతకాలను కూడా విభజించి రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత రెండు ప్రభుత్వాలు అందించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇవి ఎప్పుడ అందిస్తారనే దానిపై పతకాలు పొందిన వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పోలీసు శాఖలో ఉత్తమ పనితీరు, ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయిలో ఏటా నాలుగుసార్లు పతకాల ప్రకటన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (పీపీఎం), రాష్ట్రపతి గ్యాలెంటరీ మెడల్ (పీఎంజీ), ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎమ్)లను ప్రతి ఏటా గణతంత్రదినం, స్వాతంత్య్ర దినాల్లో ప్రకటిస్తారు. రిపబ్లిక్ డేకు ప్రకటించిన వాటిని ఇండిపెండెన్స్ డే, ఇండిపెండెన్స్ డేకు ప్రకటించిన వాటిని రిపబ్లిక్ డే నాడు ప్రదానం చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉగాది, రాష్ట్రావతరణదినం సందర్భాల్లో పోలీసు పతకాలు ప్రకటిస్తారు. వీటిని నవంబర్ 1న రాష్ట్రావతరణ వేడుకల్లో అందిస్తారు. ఈ ఏడాది అన్ని విభాగాల్లోనూ కలిపి 309 మందికి వివిధ పతకాలు దక్కాయి. ముఖ్యమంత్రి శౌర్య పతకం, మహోన్నత సేవా పతకాలను మాత్రమే రాజధానిలో జరిగే రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందిస్తారు. అయితే విభజన నేపథ్యంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరిగే అవకాశం లేదు. ఏ రాష్ట్రానికి చెందిన వారికి ఆ రాష్ట్రంలోనే, ఆ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పతకాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ఈ పతకాలు దక్కించుకున్న వారి జాబితాను కూడా విభజించాల్సి ఉంటుంది. అపాయింటెడ్ డే జూన్ 2న ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో ఎప్పుడు? ఎక్కడ ఇవ్వాలనేది ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అలా కాని పక్షంలో ఆగస్టు 15న ఉమ్మడి రాజధానిలో, ఉమ్మడి గవర్నర్ చేతుల మీదుగా ఇప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పతకాల్లో ఉత్తమ సేవా పతకం, కఠిన సేవా పతకం, పోలీసు సేవా పతకాలు పొందిన వారికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వీటిని ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఇన్చార్జి మంత్రి చేతుల మీదుగా అందిస్తారు. వీరు కేవలం ఎప్పుడు అందించాలనేది నిర్ణయించుకుంటే సరిపోతుంది.