సీవీ ఆనంద్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో అంకితభావం, కఠోర శ్రమతో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులకు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం సేవా పతకాలు ప్రకటించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, సివిల్ సప్లయి కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు మెట్రో రైల్ విభాగంలో పనిచేస్తున్న అదనపు డీసీపీ ఏ బాలకృష్ణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం) దక్కిందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అదే విధంగా మరో 11మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. ఈ పతకాలు సాధించిన అధికారులకు వచ్చే ఏడాది ఆగస్టు 15న సీఎం చేతులు మీదుగా అవార్డులు స్వీకరించనున్నారు.
పీపీఎం పొందిన వారు: చిక్కడ్‌పల్లి ఏసీపీ జే నర్సయ్య, ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, ఇంటలిజెన్స్ డీఎస్పీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, డీజీపీ సెంట్రల్ స్టోర్ డీఎస్పీ పాక గిరిరాజు, సీఐసెల్ ఇన్‌స్పెక్టర్ టీఆర్ రాజేశ్వర్‌లక్ష్మీ, గ్రేహౌండ్స్ ఆర్‌ఐ పాకంటి భూపాల్‌రెడ్డి, వరంగల్ సిటీ ఏఎస్‌ఐ బూర్గుల మహేందర్, కరీంనగర్ బెటాయలిన్ ఏఆర్‌ఎస్‌ఐ తూడి ప్రభాకర్, ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఎం రఘుపతిరావు, అంబర్‌పేట్ సీపీఎల్‌హెడ్‌కానిస్టేబుల్ ఎండీ ఖైరుద్దీన్, సీఐ సెల్ హెడ్‌కానిస్టేబుల్ పీ జీవానందం.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు 67 సేవా పతకాలు లభించాయి. ఏపీ సేవా పతకాల్లో 52 పోలీసు శౌర్య పతకాలు, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి. ఏపీ నుంచి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నాయక్, కర్నూలు ఏఎస్పీ దొడ్లా నరహర, విజయనగరం ఏఎస్‌ఐ కొటూరి ప్రసాద్రావులకు రాష్ట్కపతి విశిష్ట సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది.