వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న భారతీయుల ఇబ్బందుల్ని తొలగించేందుకు అధ్యక్ష అడ్వైజరీ కమిషన్ చేసిన సిఫార్సులను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆచరణలో పెడుతోంది. భారతీయుల వీసా దరఖాస్తులను విదేశాల్లోనూ త్వరగా తేల్చేలా అదనంగా దౌత్య కార్యాలయాలు, కౌంటర్లు తెరుస్తున్నారు. కోవిడ్ అనంతరం ప్రయాణ ఆంక్షలు తొలగించాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడటం తెల్సిందే.
అమెరికాలో అభ్యసించనున్న విద్యార్థులు, పర్యటించే సందర్శకులు చాలాకాలంపాటు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా వ్యాఖ్యానించారు. భారతీయ వీసా దరఖాస్తుదారులకు ప్రపంచంలో ఏ దేశంలో కుదిరితే ఆ దేశం నుంచే అక్కడి అమెరికా ఎంబసీ సిబ్బంది వర్చవల్‌గా ఇంటర్వ్యూలు చేసి వీసా జారీ/నిరాకరణ ప్రక్రియను పూర్తిచేయడంలో సాయపడతారు. విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో ఎక్కువ వీసా అపాయ్‌మెంట్ కౌంటర్లను తెరుస్తారు. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటారు. ఎంబసీల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. 400 రోజులకుపైబడిన వెయిటింగ్ సమయాన్ని 2–4 వారాలకు కుదించడమే వీరి లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment