
ఆ పత్రాలు మా వద్ద లేవు
ఎమర్జెన్సీలో మానవ హక్కుల తొలగింపుపై హోం శాఖ
న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి (ఎమర్జెన్సీ) విధించిన నాటి రోజుల్లో మానవ హక్కులను తాత్కాలికంగా తొలగించిన దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర సమాచార కమిషన్‌కు (సీఐసీ) తెలిపింది. 1975లో ఆత్యయిక స్థితి అమలులో ఉన్న సమయంలో మానవ హక్కుల తొలగింపునకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.
హోం మంత్రిత్వ శాఖలోని మానవ వనరుల విభాగం దీనికి సమాధానమిస్తూ..తమ విభాగం 1993లో ఏర్పాటైందనీ, 1975 నాటి సమాచారం తమ వద్ద లేదని తెలిపింది. ఈ మేరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని సీఐసీ హోం శాఖను ఆదేశించింది.