ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఇందుకోసం వీసా అనుమతి కోరుతున్నారా? మీకు సింగపూర్ పాస్ట్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా ప్రపంచంలోని 227 దేశాల్లో 192 దేశాల్ని చుట్టి రావొచ్చు.
ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ తాజాగా 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (IATA) నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది.
ఈ జాబితాలో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఆసక్తికరంగా, గత ఐదేళ్లుగా పవర్‌ఫుల్ పాస్ పోర్ట్‌ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న జపాన్ మూడవ స్థానానికి దిగజారింది. పదేళ్ల క్రితం శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. కాలక్రమేణా ఆ పాస్‌పోర్ట్ స్థానం మరింత దిగజారుతూ వచ్చింది. 2017లో ఏకంగా రెండవ స‍్థానం నుంచి నాలుగవ స‍్థానానికి పడిపోయింది.
పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితా
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో సింగపూర్ తొలిస‍్థానంలో ఉండగా జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌కు 2వ స్థానం, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెమ్‌బర్గ్, సౌత్ కొరియా, స్వీడన్‌కు 3వ స్థానం, డెన్మార్క్,ఐర్లాండ్,నెదర్లాండ్, యూకేలు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి.
పరోక్షంగా చైనానే కారణమా?
చైనాలో భౌగోళిక రాజకీయ అంశాల కారంగా డ్రాగన్ కంట్రీలో ప్రైవేట్ సంస్థలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. దీంతో వ్యాపారస్థులు, సామాన్యులు సింగపూర్‌కు వలస వెళ్లారు. మరోవైపు ఆర్ధికంగా పుంజుకోవడం వంటి అంశాలు సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అంత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అవతరించేందుకు దోహదపడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం!
Comments
Please login to add a commentAdd a comment