
అమెరికాలో కుటుంబ సగటు ఆదాయం అధికంగా ఉన్నది భారతీయులకే. ఎంత ఎక్కువంటే అమెరికన్ల ఆదాయం కంటే అది రెట్టింపు. మనవాళ్లు సంపన్నులే కాదు,
మనవాళ్ల నెలవారీ ఆదాయాలు కూడా అమెరికన్లకంటే ఎక్కువ ఉండటం విశేషం. 2019 నుంచి 2023 మధ్య సగటు భారతీయ కుటుంబ ఆదాయం 24 శాతం పెరిగితే, అమెరికన్ల ఆదాయం 18 శాతమే పెరిగింది.