Carnegie Endowment for International Peace
-
USA: అమెరికాలో భారతీయులే రిచ్
అమెరికాలో కుటుంబ సగటు ఆదాయం అధికంగా ఉన్నది భారతీయులకే. ఎంత ఎక్కువంటే అమెరికన్ల ఆదాయం కంటే అది రెట్టింపు. మనవాళ్లు సంపన్నులే కాదు, మనవాళ్ల నెలవారీ ఆదాయాలు కూడా అమెరికన్లకంటే ఎక్కువ ఉండటం విశేషం. 2019 నుంచి 2023 మధ్య సగటు భారతీయ కుటుంబ ఆదాయం 24 శాతం పెరిగితే, అమెరికన్ల ఆదాయం 18 శాతమే పెరిగింది. -
'కార్నిజీ' బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా... కార్నిజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మీడియా ప్రకటన వెలువడింది. తమ సంస్థ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా చేరడాన్ని స్వాగతిస్తున్నామని కార్నిజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ చైర్మన్ హార్వీ ఇ ఫైన్‌బర్గ్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల రతన్‌కు అపారమైన పరిజ్ఞానం ఉందని ప్రశంసించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన దేశంలో ఆయన వాణిజ్య రంగంలో కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు. రతన్ టాటాకు ఉన్న అపార అనుభవం తమ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.