'కార్నిజీ' బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా | Ratan Tata joins Carnegie Board of Trustees | Sakshi
Sakshi News home page

'కార్నిజీ' బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా

Published Thu, Sep 19 2013 11:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM

'కార్నిజీ' బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా

'కార్నిజీ' బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా

భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటా... కార్నిజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మెంబర్గా నియమితులయ్యారు. ఈ మేరకు మీడియా ప్రకటన వెలువడింది. తమ సంస్థ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో రతన్ టాటా చేరడాన్ని స్వాగతిస్తున్నామని కార్నిజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ చైర్మన్ హార్వీ ఇ ఫైన్బర్గ్ తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పట్ల రతన్కు అపారమైన పరిజ్ఞానం ఉందని ప్రశంసించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో ఒకటైన దేశంలో ఆయన వాణిజ్య రంగంలో కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు. రతన్ టాటాకు ఉన్న అపార అనుభవం తమ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement