‘నేను రోజుకు నాలుగు గంటలే పనిచేస్తాను’ అని ఎవరైనా అంటే....‘అయితే ఏంటటా’ అనుకుంటాం. నేను రోజుకు నాలుగు గంటలే పనిచేసినా నెలకు పదిహేను లక్షలు సంపాదిస్తాను’ అని అంటే మాత్రం ‘అయ్ బాబోయ్’ అని బోలెడు ఆశ్చర్య΄ోవడమే కాదు ‘అలా ఎలా?’ అని అడుగుతాం.
అమీ లాండినో (న్యూయార్క్)ను ఇప్పుడు చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. ‘నేను ఉండాల్సింది ఇక్కడ కాదు. డిజిటల్ ఫీల్డ్‌లో’ అంటూ చాలా సంవత్సరాల క్రితం కాలేజీకి గుడ్‌బై చెప్పిన అమీ లాండినో మన కరెన్సీలో నెలకు పదిహేను లక్షలకు పైగా సంపాదిస్తుంది. ‘సోషల్ మీడియా’ను లాభదాయకమైన వ్యాపారక్షేత్రంగా మలుచుకోవడంలో విజయం సాధించింది. మొదట్లో వీడియోలను యూట్యూబ్‌లో షేర్ చేసేది. ఇలా చేస్తున్న క్రమంలోనే తనలోని స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకునేది.
వ్యాపారులు తమకు కావలసిన వీడియోలను సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో నేర్పే ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించడం అమీ లాండినోకు టర్నింగ్ పాయింట్. లాండినో యూట్యూబ్ చానల్ ‘అమీ టీవి’లో తన గోల్–సెట్టింగ్ ప్రాసెస్‌తో సహా వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి. అమీ లాండినో ‘స్టార్ యూట్యూబర్’ మాత్రమే కాదు ఎన్నో పుస్తకాలు కూడా రాసింది. (సాంగ్లీ నుంచి స్టాన్‌ఫోర్డ్ వరకు.. పేద ఇంటి బిడ్డ సక్సెస్ స్టోరీ)
Comments
Please login to add a commentAdd a comment