AAI received around Rs 3,245 crore from 6 leased-out airports - Sakshi
Sakshi News home page

ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి వేల కోట్లు

Published Fri, Apr 7 2023 10:17 AM | Last Updated on Fri, Apr 7 2023 10:36 AM

AAI Received Around Rs 3245 Crore From Six Leased Out Airports Govt - Sakshi

న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్‌  కొలువుకు గుడ్‌బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్‌ సింగ్‌?)

కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్‌ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్‌ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నుంచి కన్సెషన్‌ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది.

వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్‌ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది.

కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్‌ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్స్‌ నుంచి కన్సెషన్‌ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్‌పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement