ఎన్ని ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి? | total 77 airports functional in india | Sakshi
Sakshi News home page

ఎన్ని ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి?

Published Tue, Feb 7 2017 7:28 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

ఎన్ని ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి?

ఎన్ని ఎయిర్‌పోర్టులు పనిచేస్తున్నాయి?

న్యూఢిల్లీ: ప్రజలకు రవాణా వ్యవస్థ ఎక్కడ అందుబాటులో ఉంటుందో ఆ దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే భారత దేశంలో అత్యధికంగా రోడ్డు, రైలు మార్గాల్లోనే ప్రజలు ప్రయాణిస్తుంటారు. విమానయానం చాలా మందికి ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చినచోట అధిక రేట్లు కాస్తా సామాన్యులు విమానాల్లో ప్రయాణించే పరిస్థితులు లేవు. దేశంలో వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ ఉండగా విమానాశ్రయాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం భారత దేశంలో 77 ఎయిర్ పోర్టులు మాత్రమే ఉన్నాయి. ఇందులో 72 విమానాశ్రయాలు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నేతృత్వంలో పనిచేస్తుండగా మరో 5 ఎయిర్ పోర్టులు జాయింట్ వెంచర్ గా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు భాగస్వామ్యాలతో పనిచేస్తున్నాయి. అయితే ఈ ఎయిర్ పోర్టుల్లో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా మాత్రమే విమానాలు ఎగురుతున్నాయి. 77 ఎయిర్ పోర్టుల్లో 70 వాటిల్లో మాత్రమే విమానాల రాకపోకలు సాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా అగర్తాలా, అగత్తీ ఐలాండ్స్, ఆగ్రా, అహమ్మదాబాద్, ఐజ్వాల్, అలహాబాద్, అమ్రిత్ సర్, ఔరంగాబాద్, బగ్దోగ్రా, బెంగళూరు, భటిండా, భావ్ నగర్, బోపాల్, భుబనేశ్వర్, భుజ్, కాలికట్, చత్తీస్ ఘర్, చెన్నై, కోయంబత్తూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, ధర్మశాల, దిబ్రూగర్, దిమాపూర్, డ్యూ (డామన్), గయా, గోవా, గోరఖ్ పూర్ (ప్రస్తుతం ఇక్కడ రాకపోకలను సస్పెండ్ చేశారు), గౌహాతీ, గ్వాలియర్, హుబ్లీ, హైదరాబాద్, ఇంపాల్, ఇండోర్, జబల్ పూర్, జైపూర్, జమ్మూ, జామ్ నగర్, జోధ్ పూర్, కాన్పూర్, కజురహో, కొచీ, కోల్ కతా, కులు, లేహ్, లిలాబరి, లక్నో, మధురై, మంగళూరు, ముంబై, నాగ్ పూర్, పంత్ నగర్, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణె, రాయపూర్, రాజ్ కోట్, రాంచీ, షిల్లాంగ్, సిల్చార్, శ్రీనగర్, సూరత్, తేజ్ పూర్, తిరుపతి, త్రివేండ్రమ్, ఉదయ్ పూర్, వదోధర, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్ పోర్టులు పనిచేస్తున్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీటిల్లో 28 అంతర్జాతీయ విమానాశ్రయాలు కాగా మిగిలినవి దేశీయ విమానాల రాకపోకల కోసం వినియోగిస్తున్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో... రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (హైదరాబాద్), విశాఖపట్నం (విశాఖపట్నం), శ్రీ గురురాం దాస్ జీ (అమృత్ సర్), లోక్ ప్రియ గోపీనాధ్ బర్దోలాయ్ (గువహాతీ), బిజూ పట్నాయక్ (భుబనేశ్వర్), గయా (గయా), ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (న్యూఢిల్లీ), వీర్ సావర్కర్ (పోర్ట్ బ్లెయిర్), సర్దార్ వల్లబ్ భాయిపటేల్ (అహ్మదాబాద్), కెంపెగౌడ (బెంగళూరు), మంగళూరు (మంగళూరు), కొచ్చిన్ (కొచీ), కాలికట్ (కొజికోడ్), త్రివేండ్రమ్ (తిరువనంతపురం), రాజా భోజ్ (బోపాల్), దేవీ అహల్యాభాయ్ హోల్కర్ (ఇండోర్), చత్రపతి శివాజి (ముంబై), బాబాసాహెబ్ అంబేద్కర్ (నాగ్ పూర్), పూణే (పూణ), జరుకీ (షిల్లాంగ్), చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (చెన్నై), మధురై (మధురై) జైపూర్ (జైపూర్), సివిల్ ఎయిరోడ్రమ్ (కోయంబత్తూరు), తిరుచురాపల్లి (తిరుచురాపల్లి), చౌదరి చరణ్ సింగ్ (లక్నో), లాల్ బహదూర్ శాస్త్రీ (వారణాసి), నేతాజీ సుబాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (కోల్ కతా) ఉన్నాయి. ఇందులో కొన్ని వాణిజ్య పరంగా ప్రసిద్ధికెక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement