విజయవాడ సమీపంలోని గన్నవరం సహా దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో
న్యూఢిల్లీ: విజయవాడ సమీపంలోని గన్నవరం సహా దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రణాళికలు చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సిద్ధేశ్వర మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త సమీకృత టర్మినల్ బిల్డింగ్, ఇతర ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా తిరుపతి విమానాశ్రయం అభివృద్ధికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 42.02 కోట్లు వ్యయం చేసినట్టు పేర్కొన్నారు.