సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి సోమవారం రద్దీ బాగా కలిసొస్తోంది. గత నెల 15న సోమవారం రోజు రికార్డు స్థాయిలో రూ.20.26 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఆర్టీసీ , తాజాగా ఈ సోమవారం దాన్ని బ్రేక్ చేస్తూ రూ.20.36 కోట్లను పొందింది. గత సంక్రాంతి తర్వాతి రోజు, రాఖీ పౌర్ణమి రోజు రూ.20 కోట్లను మించి టికెట్ రూపంలో ఆదాయం పొందింది. మిగతా సందర్భాల్లో ఒకేరోజు రూ.20 కోట్లను మించి ఆదాయం రికార్డు కాలేదు. ఆ రెండు సందర్భాలు పండుగలతో ముడిపడి ఉన్నందున, ఆర్టీసీ కొంత ఆశించి లక్ష్యంగా పెట్టుకుని ఆదాయం పొందింది.
ఈ సోమవారం ఎలాంటి పండుగలు లేకున్నా అంత ఆదాయం రావటం విశేషం. నిర్ధారించుకున్న లక్ష్యాన్ని మించి 116 శాతం ఆదాయం పొందటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో అది 122 శాతంగా నమోదైంది. ఆక్యుపెన్సీ రేషియో 82 శాతంగా నమోదైంది. సోమవారంరోజు 34.26 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు రికార్డు అయింది. కిలోమీటర్‌కు రూ.53.74 చొప్పున ఆదాయం (ఈపీకే) వచి్చనట్టు అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment