ticket charge
-
ఆర్టీసీ టికెట్ ధరల్లో స్వల్ప పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు (యూజర్ చార్జీలు) పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు రూ.3 చొప్పున పెరిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్ రుసుములను సవరించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై అన్ని టోల్గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఆర్టీసీ బస్సులు కూడా టోల్రుసుములు చెల్లించాల్సి ఉంటున్నందున, టికెట్ ధరల్లో ఆ రుసుము కూడా జత చేస్తున్నారు. ఇప్పుడు టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ కూడా ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్ చార్జీల్లో కలిసి ఉన్న టోల్ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13ను రూ.16కు, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రీడ్ స్లీపర్ బస్సుల్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కు పెంచారు. -
ఆర్టీసీకి లక్కీ మండే.. ఒక్కరోజే రూ.20.36 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి సోమవారం రద్దీ బాగా కలిసొస్తోంది. గత నెల 15న సోమవారం రోజు రికార్డు స్థాయిలో రూ.20.26 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఆర్టీసీ , తాజాగా ఈ సోమవారం దాన్ని బ్రేక్ చేస్తూ రూ.20.36 కోట్లను పొందింది. గత సంక్రాంతి తర్వాతి రోజు, రాఖీ పౌర్ణమి రోజు రూ.20 కోట్లను మించి టికెట్ రూపంలో ఆదాయం పొందింది. మిగతా సందర్భాల్లో ఒకేరోజు రూ.20 కోట్లను మించి ఆదాయం రికార్డు కాలేదు. ఆ రెండు సందర్భాలు పండుగలతో ముడిపడి ఉన్నందున, ఆర్టీసీ కొంత ఆశించి లక్ష్యంగా పెట్టుకుని ఆదాయం పొందింది. ఈ సోమవారం ఎలాంటి పండుగలు లేకున్నా అంత ఆదాయం రావటం విశేషం. నిర్ధారించుకున్న లక్ష్యాన్ని మించి 116 శాతం ఆదాయం పొందటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో అది 122 శాతంగా నమోదైంది. ఆక్యుపెన్సీ రేషియో 82 శాతంగా నమోదైంది. సోమవారంరోజు 34.26 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్టు రికార్డు అయింది. కిలోమీటర్‌కు రూ.53.74 చొప్పున ఆదాయం (ఈపీకే) వచి్చనట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
రైళ్లలో ప్రీమియం తత్కాల్ దోపిడీ..రూ.450 టికెట్ రూ.1000పైనే
సాక్షి, హైదరాబాద్: కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సందర్భంగా సొంత ఊరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు సురేష్. రైళ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి తత్కాల్ కోసం ప్రయత్నించాడు. సాధారణంగా స్లీపర్ చార్జీ రూ.390 వరకు ఉంటుంది. దానిపై 30 శాతం అదనంగా రూ.450 వరకు చెల్లించి తత్కాల్ టికెట్‌పై వెళ్లిపోవచ్చని భావించాడు. నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి రూ.1800 వరకు ఖర్చవుతుంది. మొత్తంగా రూ.3600తో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లి రావచ్చు. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువే అయినా ఫర్వా లేదనుకున్నాడు. చూస్తుండగానే క్షణాల్లో తత్కాల్ బుకింగ్‌లు అయిపోయాయి. సరిగా అదే సమయంలో ‘ప్రీమియం తత్కాల్’ దర్శనమిచ్చింది. రూ.450 తత్కాల్ స్లీపర్ చార్జీ అమాంతంగా రూ.1050కి చేరింది. అంటే నలుగురికి కలిపి రూ.4200 చొప్పున సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లి వచ్చేందుకు ఏకంగా రూ.8,400 అవుతుంది. మరో గత్యంతరం లేక ప్రీమియం తత్కాల్ టికెట్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది. డిమాండ్ ఉంటే చాలు.. ఒక్క తిరుపతికి వెళ్లే రైళ్లు మాత్రమే కాదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న ఏ రైళ్లలో అయినా సరే ‘ప్రీమియం తత్కాల్’ పేరిట రైల్వే అదనపు దోపిడీకి తెరలేపింది. ఫ్లైట్ చార్జీలను తలపించేలా తత్కాల్ చార్జీలను ఒకటి నుంచి రెండు రెట్లు పెంచేస్తున్నారు. గతంలో ‘డైనమిక్ ఫేర్’ పేరుతో కొన్ని పరిమిత రైళ్లకు, ఏసీ బెర్తులకు మాత్రమే పరిమితం కాగా ఇప్పుడు ఏ మాత్రం రద్దీ ఉన్నా సరే స్లీపర్ క్లాస్‌ను సైతం వదిలి పెట్టకుండా అన్ని రైళ్లలో ప్రీమియం తత్కాల్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండగ రోజుల్లో, వరుస సెలవుల్లో నడిపే ప్రత్యేక రైళ్లలో కూడా తత్కాల్‌పై రెట్టింపు చార్జీలు విధించడం గమనార్హం. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల చార్జీల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణ సదుపాయాన్ని అందజేసే రైళ్లు కూడా క్రమంగా సామాన్యులకు భారంగా మారాయి. ఈ రైళ్లకు భారీ డిమాండ్... హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. 85 ప్రధాన రైళ్లు దేశ వ్యాప్తంగా బయలుదేరుతాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, గోదావరి ప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, షిరిడీ, పట్నా, దానాపూర్ రైళ్లలో ‘ప్రీమియం తత్కాల్’ చార్జీలు విధిస్తున్నారు. -
తాజ్ మహల్‌ను చూడాలనుకుంటే..ఇకపై
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ దర్శించాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న తాజ్‌మహల్ టికెట్ రేటును అధికారులు భారీగా పెంచేశారు. ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌కోసం టూరిస్టులు ఇకపై రూ. 250 (0.70డాలర్లు) చెల్లించాలి. అలాగే అంతర్జాతీయ పర్యాటకులు ఇప్పటివరకు చెల్లించే 16డాలర్లుకు బదులుగా ఇకపై 19డాలర్లు (సుమారు రూ.1,364) చెల్లించాలి. టూరిస్టులను పరిమితం చేసేందుకు ఈపెంపు నిర్ణయం తీసుకున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి వెల్లడించారు. తాజ్‌మహల్ సందర్శకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ చర్య. గతంలో ఈ సంఖ్య 70వేలుగా ఉంది. కాగా రోజుకు సగటున 10నుంచి 15వేల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారట. 2016లో సుమారు 6.5 మిలియన్ల మంది 17శతాబ్దానికి చెందిన ఈ ప్రేమమందిరాన్ని వీక్షించినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
ఎస్‌సీఎల్‌ఆర్ మీదుగా బెస్ట్ సేవలు
సాక్షి, ముంబై: శాంతాకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్)పై నుంచి మూడు బెస్టు బస్సులను ప్రారంభించాలని ‘బృహన్ముంబై ఎలక్ట్రిక్, సప్లయ్, ట్రాన్స్పోర్ట్’ (బెస్టు) నిర్ణయించింది. వీటిని జూన్ ఒకటవ తేదీ నుంచి నడపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అణుశక్తినగర్ - పశ్చిమ గోరేగావ్ల మధ్య నడిచే 374 నెంబర్ బస్సు, భాంద్రా-కుర్లా టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్ నుంచి ఠాణే కాడబరీ జంక్షన్ల మధ్య నడిచే ఎఎస్ 5 నెంబర్ బస్సును ఎస్సీఎల్ఆర్పై నుంచి నడపనున్నారు. అదే విధంగా కొత్తగా ప్రారంభించాలనుకున్న పశ్చిమ భాంద్రా బస్సు డిపో నుంచి వాశి రైల్వేస్టేషన్ల మధ్య నడిచే సి-55 నెంబర్ బస్సును కూడా ఎస్సీఎల్ఆర్పై నుంచి నడపాలని బెస్టు నిర్ణయం తీసుకుంది. ఈ మార్గం మీదుగా బెస్టు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ టిక్కెట్ చార్జీతోపాటు చాలా తక్కువ సమయంలో తమ గమ్యాన్ని చేరుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. ఎన్నికల నియమావళి కారణంగా ఎలాంటి సందడి లేకుండా శాంతాకృజ్-చెంబూర్ లింక్‌రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్)ను ఇటీవలే ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటికే ఈ రోడ్డు మీదుగా ప్రయాణించడం ద్వారా ప్రయాణికులకు సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. సొంత వాహనాలలో వెళ్లేవారికి చాలా తక్కువ ఇంధనంతో తొందరగా చేరుకుంటుండగా మరోవైపు అటో, ట్యాక్సీలలో వెళ్లేవారికి ప్రయాణ చార్జీలు కూడా చాలా తగ్గాయి. ఈ మార్గం మీదుగా అటో, టాక్సీలలో వెళ్లే ప్రయాణికులకు సుమారు రూ.50 నుంచి రూ 60 వరకు డబ్బులు ఆదా అవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఎస్‌సీఎల్‌ఆర్ ప్రారంభానికి ముందు ములుండ్ నుంచి వకోలాకు సైన్ మీదుగా వెళ్లాలంటే సుమారు 23 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కాని ఎస్‌సీఎల్‌ఆర్ ప్రారంభం కావడంతో సుమారు అయిదు నుంచి ఆరు కిలోమీటర్లకుపైగా దూరం తగ్గిందని చెప్పవచ్చు. ఈ మార్గం వల్ల ట్రాఫిక్ సమస్యకు కూడా కొంత మేర ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో బెస్టు బస్సులు కూడా ప్రారంభమైనట్టయితే సామన్య ప్రజలు తమ గమ్యస్థానాలకు తక్కువ చార్జీలతో చేరుకునేందుకు వీలుపడనుంది.