సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ దర్శించాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న తాజ్‌మహల్ టికెట్ రేటును అధికారులు భారీగా పెంచేశారు. ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌కోసం టూరిస్టులు ఇకపై రూ. 250 (0.70డాలర్లు) చెల్లించాలి. అలాగే అంతర్జాతీయ పర్యాటకులు ఇప్పటివరకు చెల్లించే 16డాలర్లుకు బదులుగా ఇకపై 19డాలర్లు (సుమారు రూ.1,364) చెల్లించాలి. టూరిస్టులను పరిమితం చేసేందుకు ఈపెంపు నిర్ణయం తీసుకున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి వెల్లడించారు. తాజ్‌మహల్ సందర్శకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ చర్య. గతంలో ఈ సంఖ్య 70వేలుగా ఉంది.
కాగా రోజుకు సగటున 10నుంచి 15వేల మంది పర్యాటకులు తాజ్‌మహల్‌ను సందర్శిస్తారట. 2016లో సుమారు 6.5 మిలియన్ల మంది 17శతాబ్దానికి చెందిన ఈ ప్రేమమందిరాన్ని వీక్షించినట్టు లెక్కలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment