రూ.3 చొప్పున పెరిగిన టోల్ యూజర్ చార్జీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ టికెట్ చార్జీల్లో టోల్ గేట్ రుసుములు (యూజర్ చార్జీలు) పెరిగాయి. టోల్ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు రూ.3 చొప్పున పెరిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్ రుసుములను సవరించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి.
ఆర్టీసీ బస్సులు కూడా టోల్‌రుసుములు చెల్లించాల్సి ఉంటున్నందున, టికెట్ ధరల్లో ఆ రుసుము కూడా జత చేస్తున్నారు. ఇప్పుడు టోల్ గేట్ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ కూడా ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్ చార్జీల్లో కలిసి ఉన్న టోల్ రుసుములను రూ.3 చొప్పున పెంచింది.
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ఉన్న రూ.13ను రూ.16కు, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17కు, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రీడ్ స్లీపర్ బస్సుల్లో రూ.15 నుంచి రూ.18కి, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23కు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment