హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షాపింగ్ మాల్ ఆపరేటర్ల ఆదాయం 7-9 శాతం అధికం కానుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. కోవిడ్ ముందస్తు కాలం 2019-20 ఆదాయంలో ఇది 125 శాతానికి సమానమని వివరించింది. రిటైల్ విక్రయాలు బలంగా ఉండడం, అద్దెలు పెరగడం ఈ వృద్ధికి కారణమని తెలిపింది. (డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు)
‘ప్రయాణ నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత సామాజికంగా సాధారణ స్థితికి రావడంతో 2022-23లో మాల్స్‌కు కస్టమర్ల రాకలో గణనీయమైన వృద్ధికి దారితీసింది. రాబడి 60 శాతం పెరిగి కోవిడ్ ముందస్తు స్థాయి ఆదాయంలో ఇది 116 శాతానికి చేరుకుంది. అధిక ఆక్యుపెన్సీ స్థాయిలు, వ్యయ నియంత్రణ చర్యలు, బలమైన బ్యాలెన్స్ షీట్ల మద్దతుతో ఘనమైన లాభదాయకత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్ ఆపరేటర్ల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 2022–23లో లీజింగ్ రేటు చదరపు అడుగుకు 12–14 శాతం దూసుకెళ్లింది’ అని వివరించింది.
పుంజుకునే అవకాశం..
ఈ రంగంలో ఆరోగ్యకర పనితీరును పరిగణనలోకి తీసుకుంటే మూలధన వ్యయం మధ్యస్థ కాలానికి దగ్గరలో పుంజుకునే అవకాశం ఉంది. ఇందులో గణనీయమైన భాగం ప్రపంచ పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ ద్వారా సమకూరవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ప్రభావం, గతంలో రెపో రేటు పెంపుదలతో వెనుకబడిన ప్రభావం రిటైల్ అమ్మకాలతో సహా విచక్షణతో కూడిన వ్యయాన్ని తగ్గించగలదని క్రిసిల్ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు)
క్రిసిల్ రేటింగ్స్ దేశవ్యాప్తంగా 28 మాల్స్‌ను విశ్లేషించింది. ఇవి 17 నగరాల్లో 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజుకు స్థలాన్ని కలిగి ఉన్నాయి. వీటికి మొత్తం రూ.8,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. సాధారణంగా మాల్ ఆపరేటర్లు లీజు ఒప్పందాల ప్రకారం తమ ఆదాయంలో దాదాపు 85 శాతాన్ని కనీస హామీ అద్దెల నుండి సమకూర్చుకుంటారు. మిగిలినది అద్దెదారుల ఆదాయ పని తీరుతో ముడిపడి ఉంటుంది. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!)
Comments
Please login to add a commentAdd a comment