ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.
వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.
ప్రధాన ఆదాయ వనరులివే
కాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.
ఐసీసీ నుంచి సింహభాగం
జూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.
బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులు
నిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి.
చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’
Comments
Please login to add a commentAdd a comment