వరుసగా మూడో నెలా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం డౌన్
అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నా రాష్ట్రంలో నేలచూపులు
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4 శాతం తగ్గుదల
రూ.3,658 కోట్ల నుంచిరూ.3,506 కోట్లకు పడిపోయిన ఆదాయం
జూలైలో 7 శాతం, ఆగస్టులో 5 శాతం తగ్గిన జీఎస్టీ
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తగ్గిపోవడం ఇదే ప్రథమం
సాక్షి, అమరావతి: మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెబ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోంది. ప్రజా సంక్షేమం, పాలనపై దృష్టి పెట్టకుండా కేవలం స్వార్థపూరిత, కక్షపూరిత రాజకీయాలతో కాలం గడిపేస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. బాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వరుసగా మూడో నెలలో కూడా జీఎస్టీ ఆదాయం పడిపోవడమే ఇందుకు నిదర్శనం.
ఒకపక్క దేశంలోని ప్రధాన రాష్ట్రాల జీఎస్టీఆదాయం భారీగా పెరుగుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తగ్గిపోతోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వృద్ధి రేటులో పెద్ద రాష్ట్రాలతో పోటీ పడిన ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తిరోగమనంలో ఉంది. మిజోరం, మేఘాలయా, నాగాలాండ్ వంటి చిన్న రాష్ట్రాలతో పోటీపడుతోంది. తాజాగా కేంద్రం విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్ర జీఎస్టీ ఆదాయం గతేడాది సెప్టెంబర్ నెలలో రూ.3,658 కోట్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో (గత నెల) రూ.3,506 కోట్లకు పడిపోయింది. అంటే 4 శాతం తగ్గిపోయింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక 8 శాతం, కేరళ 7 శాతం, తమిళనాడు 5 శాతం వృద్ధిని సాధించాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రతి నెలా జీఎస్టీ ఆదాయం పెరుగుతున్నా మన రాష్ట్రంలో మాత్రం జూలై నెలలో ఏడు శాతం, ఆగస్టులో 5 శాతం, సెప్టెంబర్‌లో 4 శాతం మేర తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment