ఫోర్బ్స్ బిలియనీర్ 2023 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. మరి అంబానీ కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయన మరెవ్వరో కాదు అంబానీకి దగ్గరి బంధువు , ముంబై ఇండియన్స్ బాస్ నిఖిల్ మెస్వానీ. ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న క్రమంలో నిఖిల్ సంపాదన, ఇతర విశేషాలపై ఆసక్తి నెలకొంది.
ముఖేష్ అంబానీకి చెందిన ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ జట్టు బాస్‌గా నిఖిల్ మెస్వానీ జట్టు రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం మాత్రమే కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను విజయవంతమైన వెంచర్‌గా మార్చడంలో కూడా ఆయనది కీలక పాత్ర. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న నిఖిల్ మెస్వానీ 1986లో కంపెనీలో చేరారు. జూలై 1988లో నిఖిల్ మెస్వానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నిఖిల్‌తోపాటు అతని ఇతర కుటుంబ సభ్యులు కంపెనీ ఎదుగుదలలో కీలక భూమిక పోషిస్తుండటం విశేషం.
ఫోర్బ్స్ ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిఖిల్ సంపాదన రూ. 24 కోట్లు. ఇది ముఖేష్ అంబానీ సంపాదించిన దానికంటే ఎక్కువ. అంబానీ 10 సంవత్సరాలకు పైగా తన వేతానాన్ని రూ.15 కోట్లకు కుదించుకుంటున్న సంగతి తెలిసిందే. (వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేసింది: ధర చూస్తే ఇపుడే కావాలంటారు!)
నిఖిల్ మెస్వానీ ఎవరు?
నిఖిల్ మెస్వానీ ముంబై విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్, అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఇండియాకు తిరిగి వచ్చి రిలయన్స్‌లో చేరారు. రిలయన్స్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన నిఖిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా 1997 - 2005 మధ్య భారీ రిఫైనరీ వ్యాపార బాధ్యతలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన జామ్‌నగర్ రిఫైనరీతో సహా కంపెనీ అనేక ప్రధాన ప్రాజెక్టులలో కీలక పాత్ర పోషించిన ఘనత మెస్వానీ సొంతం. టెలికాం, రిటైల్ రంగాల్లోకి కంపెనీ ప్రవేశంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం)
నిఖిల్ సోదరుడు హితల్ మెస్వానీ కూడా మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీ రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కాగా నిఖిల్ మేస్వానీ తండ్రి, రసిక్లాల్ మేస్వానీ, ధీరూభాయ్ అంబానీకి బంధువు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు కావడం గమనార్హం.
నిఖిల్ మెస్వానీ దాతృత్వం
దాతృత్వ కార్యక్రమాలలో కూడా నిఖిల్ పాల్గొంటారు. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధితో సహా వివిధ సామాజిక కారణాలను ఫౌండేషన్ చూసుకుంటుంది.
ముంబై ఇండియన్స్ Vs x గుజరాత్ టైటన్స్
ఈ రోజు ( ఏప్రిల్ 25, మంగళవారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో IPL 2023లో మ్యాచ్ నం. 35లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.
Power, finesse, switchin’ it up when needed - Nehal can do it all. 💪#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/s2Bl4BqWrb
— Mumbai Indians (@mipaltan) April 25, 2023
Comments
Please login to add a commentAdd a comment