అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్‌కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్‌కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి.
ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్‌మెంట్‌లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది.
ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్‌స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్‌చేసి ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్‌కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు.
స్టాక్‌మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్‌చేసి స్టాక్‌లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి!
Comments
Please login to add a commentAdd a comment