investiments
-
ఆంధ్రప్రదేశ్‌లో ముఠాల పాలన... రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది...
-
ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
సాఫ్ట్వేర్ దిగ్గజం అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం వివిధ విభాగాల్లో దాదాపు రూ.83వేలకోట్లు(10 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టింది. తాజాగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ ఆఫీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల్లో పెట్టుబడులను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలియజేశారు.ప్రైవేట్ ఈక్విటీ రంగంలో ఏఐ సాధనాలను ఉపయోగించిన మొట్టమొదటి అతిపెద్ద భారతీయ అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ప్రేమ్‌జీఇన్వెస్ట్ నిలిచింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ క్వాంట్ మోడల్‌పై పని చేస్తోందని మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ టీకే కురియన్ తెలిపారు. అధికరాబడుల కోసం ఏఐటూల్స్‌ను వినియోగిస్తూ ఆయా కంపెనీల్లో తన పెట్టుబడులను సైతం పెంచుకోవాలనుకుంటుందని ఆయన చెప్పారు.బ్లాక్‌రాక్ ఇంక్., సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్ప్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సంస్థలు మార్కెట్లోని డేటా స్ట్రీమ్‌లను విశ్లేషించడానికి ఏఐపై ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఈ రంగంలో మరింత పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే ప్రేమ్‌జీఇన్వెస్ట్ మూడేళ్ల క్రితం ఏఐ ఇన్వెస్ట్మెంట్ సాధనాలను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. దానికోసం ఏఐ ఇంజినీర్లను నియమించుకుంది. అదే సమయంలో ఏఐ ఇన్వెస్ట్మెంట్ టూల్స్ తయారుచేసే సంస్థలకు మద్దతుగా నిలవడం మొదలుపెట్టినట్లు తెలిసింది.ఇదీ చదవండి: నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించడానికి 600 పారామీటర్లను విశ్లేషించేందుకు ఏఐ సహాయం చేస్తోందని కురియన్ అన్నారు. ఈ కసరత్తు వల్ల తోటివారి కంటే ముందంజలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కోహెసిటీ ఇంక్-డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ, లండన్‌లోని ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ-హోలిస్టిక్ ఏఐ, ఇకిగాయ్, ఫిక్సిస్ వంటి ప్రముఖ కంపెనీలకు ప్రేమ్‌జీఇన్వెస్ట్ సేవలందిస్తోందని తెలిసింది. దేశంలో అధికంగా పోగవుతున్న కోర్టు కేసులను వేగంగా పరిష్కరించడానికి ఉపయోగపడే ఏఐను అభివృద్ధి చేసేందుకు సంస్థ సహకరిస్తుందని కురియన్ అన్నారు. -
అమిత్‌షా ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారో తెలుసా..
గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఇటీవల ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే అందులో మంత్రి పెట్టుబడుల వివరాలను పేర్కొన్నారు. స్టాక్మార్కెట్లోని చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అమిత్ షా మెుత్తం పెట్టుబడుల విలువ రూ.17.46 కోట్లుగా ఉంది. ఆయాన భార్య సోనాల్ షా 80 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ రూ.20 కోట్లని తెలిసింది. అమిత్‌షాతోపాటు ఆయన భార్య సోనాల్‌షా ప్రధానం పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.అమిత్‌షా పెట్టుబడుల్లో కొన్ని..హిందుస్థాన్ యూనిలీవర్ రూ.1.4 కోట్లుఎంఆర్ఎఫ్ రూ.1.3 కోట్లుకోల్గేట్-పామోలివ్ (ఇండియా) రూ.1.1 కోట్లుప్రాక్టర్ & గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ రూ.0.96 కోట్లు ఏబీబీ ఇండియా రూ.0.7 కోట్లుసోనాల్షా పెట్టుబడుల్లో కొన్ని..కెనరా బ్యాంక్‌లో అమిత్ షా దాదాపు రూ.7.25 లక్షల విలువైన షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఆయన భార్య సోనాల్ షా రూ.3 కోట్ల విలువైన షేర్లు కలిగి ఉన్నారు.కరూర్వైశ్యా బ్యాంక్‌లో రూ.1.9 కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నాయి.గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీలో రూ.1.8 కోట్ల పెట్టుబడి పెట్టారు.లక్ష్మి మిషన్ వర్క్స్‌లో రూ.1.8 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి.భారతీఎయిర్‌టెల్ కంపెనీలో రూ.1.3 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.ఇదీ చదవండి: ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!అమిత్ షా పోర్ట్‌ఫోలియోలో ఐటీసీ, వీఐపీ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కమిన్స్ ఇండియా, నెరోలాక్ పెయింట్స్ వంటి కంపెనీలున్నాయి. హోం మంత్రి బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని స్టాక్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. -
Vibrant Gujarat Summit: 2036 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్..?
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్లోబల్‌గా వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ సీఈవోలతో భారత్‌లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో 50 శాతం మేర ‘గ్రీన్ ఎంఓయూ’లు కుదరనున్నట్లు తెలిపారు. జీ20 వంటి అంతర్జాతీయ సదస్సులకు భారత్ ప్రాతినిధ్యం వహించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34 దేశాలు పాల్గొననున్నట్లు చెప్పారు. గుజరాత్లో పెట్టుబడి అవకాశాలను పెంచడానికి సేల్స్‌ఫోర్స్, అబాట్, బ్లాక్‌స్టోన్, హెచ్ఎస్బీసీ, యూపీఎస్, మైక్రోన్, సిస్కో, ఎస్‌హెచ్‌ఆర్‌ఎం వంటి దాదాపు 35 ఫార్చ్యూన్ అమెరికన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరవుతున్నాయని తెలిపారు. ఈ సదస్సులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్అంబానీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోదీ మాటకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సదస్సును 20 ఏళ్ల నుంచి విజయవంతంగా నిర్వహించడం గొప్పవిషయం అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గుజరాత్లో భారీ పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా రూ.12 లక్షలకోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. అందులో మూడోవంతు గుజరాత్‌లోనే ఉన్నట్లు తెలిపారు. దాంతో ప్రభుత్వ సహకారంతో చాలామందికి ఉపాధికల్పిస్తున్నట్లు చెప్పారు. 2036 ఒలింపిక్స్ కోసం భారత్ బిడ్ వేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: 2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా.. ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’ 2003లో ప్రారంభించారు. ప్రస్తుతం జరుగుతున్న పదో ఎడిషన్ సదస్సుతో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సదస్సులో భాగంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో 2024లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు, ఇండియా స్టాక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఇండస్ట్రీ 4.0, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్, స్మార్ట్ మ్యాన్యుఫ్యాక్ట్), ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్, డిస్ట్రప్టివ్ టెక్నాలజీస్‌ను ప్రదర్శించనున్నారు. -
రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ పుస్తక రచయిత.. కారణం ఇదే..
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం అన్న వెంటనే చాలా మందికి ఆర్థిక పాఠాలు, గుడ్ డెట్-బ్యాడ్ డెట్, స్టాక్మార్కెట్లో పెట్టుబడులు, వాటి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా చాలా అంశాలు గుర్తుకొస్తాయి. 1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడైంది. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్టి కియోసాకి ప్రస్తుతం అప్పుల్లో ఉన్నారంటూ ఆయనే స్వయంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం. రాబర్ట్టి కాయోసా ఇన్‌స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు. అందులో ఆస్తులు, రుణాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. ‘మన చుట్టూ ఉన్నవాళ్లు చాలా మంది విలాసాల కోసం అప్పు చేస్తారు. కానీ నేను మాత్రం ఆస్తులను కొనడానికి అప్పు చేస్తాను. ఫెరారీ, రోల్స్ రాయల్స్ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు. అవి ఆస్తులు కావు. సంపాదనను డబ్బు రూపంలో ఆదా చేయను. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తాను. పెట్టుబడుల్లో భాగంగా నేను చేసిన అప్పు 1.2 బిలియన్ డాలర్ల(రూ.10 వేల కోట్లు)కు చేరింది’ అని ఆయన చెప్పారు. పెట్టుబడుల రూపంలో తాను చేసిన అప్పే ఆయన ఆస్తి అని కియోసాకి అన్నారు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు కియోసాకి తన పుస్తకంలో పెట్టుబడులకు సంబంధించి వివరంగా చెప్పారు. అత్యవసర వస్తువులు, అవసరమైన వస్తువులు, అనవసరమైన వస్తువులు అంటూ విభజించుకుని డబ్బు వెచ్చించాలని చెప్పారు. డబ్బును మరింత పెంచేలా పెట్టుబడిపెట్టేందుకు చేసే రుణాలు గుడ్ డెట్ అని ఆయన రాశారు. డబ్బు ఖాళీగా బ్యాంక్ ఖాతాల్లో ఉండడంకంటే మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. స్టాక్మార్కెట్లో డివిడెంట్ ఇచ్చే స్టాక్ల్లో పెట్టుబడి పెట్టాలని, మార్కెట్ ఒడుదొడుకులను లోనైతే బంగారం, రియల్ ఎస్టేట్‌లో మదుపు చేయాలని ఆయన తన పుస్తకంలో రాశారు. -
పనిచేయకుండానే డబ్బు కావాలా..?
అవునండీ.. పని చేయకుండానే డబ్బులు వస్తాయి. ఎలాగంటారా..? ప్యాసివ్ ఇన్‌కమ్‌తో ఇది సాధ్యం అవుతుంది. ప్యాసివ్ ఇన్‌కమ్‌తో కులాసాగా కాలం గడిపేయొచ్చు అనే భావన ఇప్పటికే చాలామందికి వచ్చేసింది. ఇంతకీ ఫ్యాసివ్ ఇన్కమ్ అంటే పని చేయకుండా వచ్చే ఆదాయం అన్నమాట! ఇదేదో బాగానే ఉందే.. ఇక కాయకష్టం చేయాల్సిన అవసరం లేదని ఫిక్సయిపోకండి. అలా కాలు కదపకుండా కాసులు రాలాలంటే అంతకుముందు యాక్టివ్ ఇన్కమ్ గణనీయంగా సంపాదిస్తే గానీ, ప్యాసివ్ సంపాదన సాధ్యపడదని మాత్రం గుర్తుంచుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రత్యేక్షంగా మన ప్రమేయం లేకుండా స్థిరంగా డబ్బు వచ్చే విధానం. ఈ ఆదాయం రెంటల్ ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్లు, క్రియేటివ్ వర్క్ రాయల్టీలు, డివెడెండ్లు.. నుంచి జనరేట్ అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్పైన డైలీ అటెన్షన్ అవసరం ఉండదు. అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు యూట్యూబ్ చానల్ పెడితే లక్షల్లో సంపాదించొచ్చని చాలామంది అంటారు. అయితే అందుకు మాత్రం ముందు చాలా కష్టపడాలి. ఒకసారి మనిటైజేషన్ అయిపోయి ఫాలోవర్లు పెరుగుతుంటూ డబ్బు వస్తూంటుంది. కొన్నిసార్లు వీడియో చేయకపోయినా కొందరు మనం గతంలో చేసిన వీడియోలు చూస్తారు కాబట్టి డబ్బు వస్తుంది. ఇన్‌స్టాలో కొత్తగా ఏదైనా థీమ్ క్రియేట్చేసి ఇన్‌స్టాంట్‌గా వైరల్ అయిపోవచ్చు. కానీ అందుకు చాలా కష్టపడాలి. అయితే ఫ్యాసివ్ ఇన్కమ్ నిర్వచనాన్ని అర్థం చేసుకోకుండా సంపాదనకు షార్ట్‌కట్స్ ఎంచుకుంటే మూడు షేర్లు… ఆరు లైకులకు పరిమితం అవుతారని నిపుణులు చెబుతున్నారు. స్టాక్మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్‌చేసి స్టాక్‌లు పెరుగుతున్నపుడు అందులో మదుపుచేసిన డబ్బు పెరుగుతుంది. దాంతోపాటు కంపెనీలు మంచి త్రైమాసిక ఫలితాలు పోస్ట్ చేస్తూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని చెబుతుంటాయి. అయితే అందుకుగల కారణాలను విశ్లేషిస్తూ సిప్ మోడ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. కంపెనీలు డివెండెండ్ ప్రకటిస్తున్నపుడు పెరిగిన స్టాక్ ధరతో సంబంధం లేకుండా అదనంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ను సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే మరెన్నో మార్గాలున్నాయని, కానీ అంతకుముందు యాక్టివ్ మనీను సంపాదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి! -
అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా
ఈక్విటీ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన చాలామంది మార్కెట్ అవర్‌లో తీవ్ర ఆందోళన చెందుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఎలాంటి టెన్షన్ పడకుండా, నిశ్చింతగా ఉంటారు. అయితే కేవలం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికే ఇలాంటి ఆందోళన పరిస్థితులుంటే.. కంపెనీలు స్థాపించి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్ అంబానీ పరిస్థితేంటో ఊహించండి.. కానీ ఆయన చాలా విషయాలు పట్టించుకోరని కేడియా సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కేడియా అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం. విజయ్ కేడియా ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చాలా మంది ట్రేడింగ్‌కు సంబంధించి ఆందోళన చెందుతుంటారు. అయితే మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి కొందరు ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే బుల్ మార్కెట్ లేదా బేర్ మార్కెట్‌ను పట్టించుకోకుండా పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటి వారు ప్రధానంగా బిజినెస్ మోడల్‌పై దృష్టిసారిస్తారు. మంచి బిజినెస్ మోడల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి ట్రెండ్‌ను పట్టించుకోరు. కంపెనీ ప్రమోటర్లు తమ వ్యాపారాలను విస్తరింపజేసి, అది బుల్ మార్కెటా? లేదా బేర్ మార్కెటా? అని నిర్ధారించుకోరు. మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించి ప్రమోటర్లు నిర్ణయం తీసుకోరు’ అని కెడియా చెప్పారు. ‘ప్రధానంగా కంపెనీ ప్రమోటర్లు, వ్యవస్థాపకులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆర్థిక పోకడలు ఎలా ఉన్నాయి? అదే సెగ్మెంట్లోని ఇతర కంపెనీల ట్రెండ్ ఎలా ఉందో చూస్తారు. మార్కెట్ ట్రెంట్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ముఖేష్ అంబానీని అడిగితే తనకు తెలియదు. ఆయన నిర్ణయాలపై బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఆధారపడుతుంది. కానీ తాను మార్కెట్‌ను అనుసరించరు’ అని కేడియా వివరించారు. ఇదీ చదవండి: ఇకపై కేటరింగ్ చేయనున్న ఫుడ్ డెలివరీ సంస్థ..? మార్కెట్ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంటుందని కేడియా చెప్పారు. గత రెండేళ్లలో మార్కెట్లో చాలా అనిశ్చితులు నెలకొన్నాయన్నారు. యుఎస్ మాంధ్యం, ద్రవ్యోల్బణం, కీలక వడ్డీరేట్లు, రెండు ప్రధాన దేశాల మధ్య యుద్ధాలు, ఎన్నికలు.. ఇవన్నీ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు చెప్పారు. -
కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సుసాన్ గ్రేస్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అరవింద్ కుమార్, జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణాన్ని వివరించారు. మౌలిక వసతులు, క్రీడలు, ఐటీ రంగాల్లో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. మహిళా వ్యాపారవేత్తల కోసం వి-హబ్ ఏర్పాటు చేసినందుకు కేటీఆర్‌ను సుసాన్ గ్రేస్ అభినందించారు. ఈ భేటీలో ట్రేడ్ కమిషనర్ మునీష్ శర్మ కూడా పాల్గొన్నారు. Hon'ble @AusCGChennai Ms Susan Grace met Minister @KTRTRS at Camp Office. Mr Munish Sharma, Trade Commissioner & Consul Australia Trade and Investment Commission, Mr Narsing Rao, IAS, Principal Secretary to CM, Prl Secretaries @arvindkumar_ias & @jayesh_ranjan were also present. pic.twitter.com/F8B7pTw2wL — Min IT, Telangana (@MinIT_Telangana) April 16, 2018 -
పలు కంపెనీలతో కేటీఆర్ సమావేశం
అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మూడో రోజు పలు కంపెనీలతో సమావేశం అయ్యారు. టెలికాం దిగ్గజాలైన నోకియా, ఎరిక్ సన్ కంపెనీలతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు. తాము చేపడుతున్న ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని, దీని వలన భారత దేశంలోని టెలి కమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు. కేటీఆర్ విజ్ఞప్తిని నోకియా ప్రతినిధులు ఆసక్తి చూపారు. త్వరలోనే ఫైబర్ గ్రిడ్ కోసం జారీ చేయబోయే అర్ యప్ ఫి (RFP) లో పాల్గొంటామని తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డాటా అనలిటిక్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రాధాన్యతలు, అవకాశాలు అనే అంశంపైన ప్రముఖ పెట్టుబడిదారులతో ముఖాముఖి సంభాషించారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అత్యుత్తమ వ్యాపార విధానాలను అమలు పరుస్తోందని తెలిపారు. పరిశ్రమలు, సోలార్, ఐటి రంగాల పైన పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమధానాలిచ్చారు. మ్యూల్ సాప్ట్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ర్టంలో గత మూడు సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడులను వివరించారు. స్టార్టప్ కంపెనీలకు సేవలందించేందుకు స్ర్టైప్ కంపెనీతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ మేరకు అత్యధిక స్టార్టప్స్ ఉన్న టీహబ్ ద్వారా కలసి పని చేస్తామని, సిలికాన్ వ్యాలీలో టీహబ్ ఎర్పాటు చేసిన టిబ్రిడ్జ్ తో కలిసి పనిస్తామని కంపెనీ మంత్రికి తెలిపింది. సేల్స్ ఫోర్సు కార్యాలయంలో కంపెనీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. -
పలు కంపెనీలతో కేటీఆర్ సమావేశం
-
తెలంగాణలో పెట్టుబడులకు కెనడా ఆసక్తి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధి బృందం ఆసక్తి చూపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని, పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానని చెప్పారు. కెనడాలోని అంటారియో ప్రధాని కేథలిన్ వైన్ బృందంతో వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. అనంతరం మీ డియాతో మాట్లాడారు. ఆకర్షణీయ నగరాలు, అందరికీ ఇళ్లు పథకాలపై కెనడా బృందం ఆసక్తిచూపిందని చెప్పారు. భువనేశ్వర్ నగరానికి సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. కెనడా బృందంలో తెలుగు మంత్రి దీపిక దామెర్ల కూడా ఉన్నారని, ఆమెకు అన్ని అంశాలను వివరించానని పేర్కొన్నారు.