కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధి బృందం ఆసక్తి చూపిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని, పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరానని చెప్పారు. కెనడాలోని అంటారియో ప్రధాని కేథలిన్ వైన్ బృందంతో వెంకయ్య నాయుడు శనివారం సమావేశమయ్యారు. అనంతరం మీ డియాతో మాట్లాడారు.
ఆకర్షణీయ నగరాలు, అందరికీ ఇళ్లు పథకాలపై కెనడా బృందం ఆసక్తిచూపిందని చెప్పారు. భువనేశ్వర్ నగరానికి సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. కెనడా బృందంలో తెలుగు మంత్రి దీపిక దామెర్ల కూడా ఉన్నారని, ఆమెకు అన్ని అంశాలను వివరించానని పేర్కొన్నారు.