రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం అన్న వెంటనే చాలా మందికి ఆర్థిక పాఠాలు, గుడ్ డెట్-బ్యాడ్ డెట్, స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు, వాటి ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి, వ్యాపారం.. ఇలా చాలా అంశాలు గుర్తుకొస్తాయి. 1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడైంది. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్‌టి కియోసాకి ప్రస్తుతం అప్పుల్లో ఉన్నారంటూ ఆయనే స్వయంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆయన ఎందుకు అప్పు చేయాల్సి వచ్చిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
రాబర్ట్‌టి కాయోసా ఇన్‌స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు. అందులో ఆస్తులు, రుణాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. ‘మన చుట్టూ ఉన్నవాళ్లు చాలా మంది విలాసాల కోసం అప్పు చేస్తారు. కానీ నేను మాత్రం ఆస్తులను కొనడానికి అప్పు చేస్తాను. ఫెరారీ, రోల్స్ రాయల్స్ వంటి విలాసవంతమైన వాహనాలు అప్పు. అవి ఆస్తులు కావు. సంపాదనను డబ్బు రూపంలో ఆదా చేయను. ఆ మొత్తాన్ని వెండి, బంగారం రూపంలో మారుస్తాను. పెట్టుబడుల్లో భాగంగా నేను చేసిన అప్పు 1.2 బిలియన్ డాలర్ల(రూ.10 వేల కోట్లు)కు చేరింది’ అని ఆయన చెప్పారు. పెట్టుబడుల రూపంలో తాను చేసిన అప్పే ఆయన ఆస్తి అని కియోసాకి అన్నారు.
ఇదీ చదవండి: అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
కియోసాకి తన పుస్తకంలో పెట్టుబడులకు సంబంధించి వివరంగా చెప్పారు. అత్యవసర వస్తువులు, అవసరమైన వస్తువులు, అనవసరమైన వస్తువులు అంటూ విభజించుకుని డబ్బు వెచ్చించాలని చెప్పారు. డబ్బును మరింత పెంచేలా పెట్టుబడిపెట్టేందుకు చేసే రుణాలు గుడ్ డెట్ అని ఆయన రాశారు. డబ్బు ఖాళీగా బ్యాంక్ ఖాతాల్లో ఉండడంకంటే మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. స్టాక్‌మార్కెట్‌లో డివిడెంట్ ఇచ్చే స్టాక్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, మార్కెట్ ఒడుదొడుకులను లోనైతే బంగారం, రియల్ ఎస్టేట్‌లో మదుపు చేయాలని ఆయన తన పుస్తకంలో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment