పలు కంపెనీలతో కేటీఆర్ సమావేశం
Published Wed, May 24 2017 4:40 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మూడో రోజు పలు కంపెనీలతో సమావేశం అయ్యారు. టెలికాం దిగ్గజాలైన నోకియా, ఎరిక్ సన్ కంపెనీలతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని కోరారు. తాము చేపడుతున్న ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తామని, దీని వలన భారత దేశంలోని టెలి కమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి తెలిపారు. కేటీఆర్ విజ్ఞప్తిని నోకియా ప్రతినిధులు ఆసక్తి చూపారు. త్వరలోనే ఫైబర్ గ్రిడ్ కోసం జారీ చేయబోయే అర్ యప్ ఫి (RFP) లో పాల్గొంటామని తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డాటా అనలిటిక్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు.
యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడుల ప్రాధాన్యతలు, అవకాశాలు అనే అంశంపైన ప్రముఖ పెట్టుబడిదారులతో ముఖాముఖి సంభాషించారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అత్యుత్తమ వ్యాపార విధానాలను అమలు పరుస్తోందని తెలిపారు. పరిశ్రమలు, సోలార్, ఐటి రంగాల పైన పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమధానాలిచ్చారు.
మ్యూల్ సాప్ట్ కంపెనీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ర్టంలో గత మూడు సంవత్సరాల్లో వచ్చిన పెట్టుబడులను వివరించారు. స్టార్టప్ కంపెనీలకు సేవలందించేందుకు స్ర్టైప్ కంపెనీతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ మేరకు అత్యధిక స్టార‍్టప్స్ ఉన్న టీహబ్ ద్వారా కలసి పని చేస్తామని, సిలికాన్ వ్యాలీలో టీహబ్ ఎర్పాటు చేసిన టిబ్రిడ్జ్ తో కలిసి పనిస్తామని కంపెనీ మంత్రికి తెలిపింది. సేల్స్ ఫోర్సు కార్యాలయంలో కంపెనీ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
Advertisement
Advertisement