నేటి నుంచి కేటీఆర్ అమెరికా పర్యటన
హైదరాబాద్ : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారక రామారావు నేటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పాటు వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్, సిలికాన్ వ్యాలీ, మిన్నెసోట, చికాగోలో పర్యటిస్తారు.
సిలికాన్ వ్యాలీలో టి.బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి సంబంధించి అమెరికా ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా కేటీఆర్ పర్యటన కొనసాగనుంది.