అమిత్‌షా ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేశారో తెలుసా.. | The Top Stock Holdings Of Central Home Minister AmithShah | Sakshi
Sakshi News home page

అమిత్‌షా ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేశారో తెలుసా..

Apr 26 2024 3:14 PM | Updated on Apr 26 2024 7:00 PM

The Top Stock Holdings Of Central Home Minister AmithShah

గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఇటీవల ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే అందులో మంత్రి పెట్టుబడుల వివరాలను పేర్కొన్నారు. స్టాక్‌మార్కెట్‌లోని చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిసింది.  

అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అమిత్ షా మెుత్తం పెట్టుబడుల విలువ రూ.17.46 కోట్లుగా ఉంది. ఆయాన భార్య సోనాల్ షా 80 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ రూ.20 కోట్లని తెలిసింది. అమిత్‌షాతోపాటు ఆయన భార్య సోనాల్‌షా ప్రధానం పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

అమిత్‌షా పెట్టుబడుల్లో కొన్ని..

  • హిందుస్థాన్ యూనిలీవర్ రూ.1.4 కోట్లు

  • ఎంఆర్‌ఎఫ్ రూ.1.3 కోట్లు

  • కోల్‌గేట్-పామోలివ్ (ఇండియా) రూ.1.1 కోట్లు

  • ప్రాక్టర్ & గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ రూ.0.96 కోట్లు 

  • ఏబీబీ ఇండియా రూ.0.7 కోట్లు

సోనాల్‌షా పెట్టుబడుల్లో కొన్ని..

  • కెనరా బ్యాంక్‌లో అమిత్ షా దాదాపు రూ.7.25 లక్షల విలువైన షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఆయన భార్య సోనాల్ షా రూ.3 కోట్ల విలువైన షేర్లు కలిగి ఉన్నారు.

  • కరూర్‌వైశ్యా బ్యాంక్‌లో రూ.1.9 కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నాయి.

  • గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ కంపెనీలో రూ.1.8 కోట్ల పెట్టుబడి పెట్టారు.

  • లక్ష్మి మిషన్‌ వర్క్స్‌లో రూ.1.8 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి.

  • భారతీఎయిర్‌టెల్‌ కంపెనీలో రూ.1.3 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.

ఇదీ చదవండి: ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్‌!

అమిత్ షా పోర్ట్‌ఫోలియోలో ఐటీసీ, వీఐపీ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కమిన్స్ ఇండియా, నెరోలాక్ పెయింట్స్ వంటి కంపెనీలున్నాయి. హోం మంత్రి బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని స్టాక్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement