స్నేహితులు.. సన్నిహితులు.. సహచరులు.. ఇంకా చెప్పాలంటే.. సకుటుంబ సపరివార సమేతంగా పచ్చని పొదరిళ్ల మధ్య.
స్నేహితులు.. సన్నిహితులు.. సహచరులు.. ఇంకా చెప్పాలంటే.. సకుటుంబ సపరివార సమేతంగా పచ్చని పొదరిళ్ల మధ్య.. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. విందు వినోదాలు.. ఆటపాటలు.. వన విహారాలు.. ఆ సందడి.. ఆ కేరింతలు.. మాటల్లో చెప్పలేం. ఇదంతా కార్తీక వనభోజనాల విశిష్టత..
పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉందని తెలియజేయడమే ఈ వనసమారాధనల అంతస్సూత్రం. ఆచారాలు, సంప్రదాయాల ప్రాధాన్యత తెలియజేసేందుకు ఉద్దేశించిన ఈ వనభోజనాలు కాలక్రమంలో కులభోజనాలుగా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు.
కులాలు, వర్గాల ప్రాతిపదికన ఇప్పుడు ప్రతివారం కార్తీక సమారాధనలు జరుగుతున్నారుు. సామాజిక సంఘీభావానికి సంబంధించిన ఈ అంశాన్ని కదిలిస్తే తేనె తుట్టెను కదిలించినట్లే. చివరికి విద్యార్థులు కూడా కులాల ప్రాతిపదికన వన భోజనాలు ఏర్పాటుచేసుకోవడం.. బలప్రదర్శనల మాదిరి పోటాపోటీగా నిర్వహించడమే ఇక్కడ ప్రస్తావనాంశం. వనభోజనం కాస్త వర్ణ భోజనంగా మారిన క్రమంతోపాటు.. మరికొన్ని రాజకీయ సిత్రాలను ఈ వారం విశాఖ తీరంలో చూద్దాం.. - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
కార్తీక వనసమారాధనలు పక్కదోవ పడుతున్నారుు. ఆధ్యాత్మికత, ఆనందం వెల్లివిరిసేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగాల్సిన సమారాధనలు ఇప్పుడు వర్గ, వర్ణ బలప్రదర్శనలకు వేదికలుగా మారుతున్నారుు. రాజకీయ జాతరలను తలపిస్తున్నారుు. విశాఖపట్నంలో రెండో కార్తీక ఆదివారం ఓ కళాశాల విద్యార్ధులు కులాల వారీగా చీలిపోరుు తమ వర్గానికి చెందిన వారితోనే వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ పార్టీల ర్యాలీల మాదిరిగా పోటాపోటీగా బైక్‌లతో బలప్రదర్శనకు దిగారు. ఇక కాలేజీలో పాఠాలు చెప్పే అధ్యాపకుల్లో కూడా తమ వర్గానికి చెందిన వారినే ఎంచుకుని ఆహ్వానం పంపారు. ఓ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులు తమ వర్గానికి చెందిన సినీహీరోల పాటల సౌండ్ ఎక్కువగా పెట్టారు. పక్క తోటలోనే ఉన్న మరో సామాజికవర్గ విద్యార్థులు సౌండ్ తగ్గించాలని కోరారు. అంతే వివాదం రాజుకుంది.
అది చిలికిచిలికి గాలివానలా మారకుండా మాస్టార్లు జోక్యం చేసుకుని అప్పటికి సర్దేశారు. కానీ ఇది ఆ నోటా ఈ నోటా తెలిసి ఇప్పుడు భారీఎత్తున వనభోజనాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు పోలీస్ బందోబస్తు కోరుతున్నారు. వాస్తవానికి రూ.500, వెరుు్య రూపాయల నోట్ల రద్దుతో నెలకొన్న ఆర్ధిక ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక వనసమారాధనల సందడి తగ్గిందనే చెప్పాలి. కార్తీక మాసంలో చాలా అరుదుగా ఐదు సోమవారాలు వచ్చిన ఈ ఏడాది వనభోజనాల సందడి పెరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని నోట్లరద్దు ఉత్పాతంతో సామాన్య ప్రజలు సమారాధానలకు ఈ ఏడాది ఒకింత దూరంగానే ఉన్నారు. అరుుతే కులాలు, వర్గాల ప్రాతిపదికన నిర్వహించే సమారాధానల లెక్కకు మాత్రం ఢోకా లేదు. కార్తీక మాస విశిష్టతను, శాస్త్రాన్ని, పుణ్యఫలాలను పక్కనపెట్టి లౌకికంగా ఆలోచించినా ఎంతో హితకరమైన ఈ వనభోజనాలను కులభోజనాలుగా మార్చిన నవతరం ప్రతినిధులు.. యువ’కులం’ మాదంతా ఒకే కులం అన్న మహాకవుల భావాలు.. ఎప్పుడు బుర్రలోకి ఎక్కించుకుంటారో?
పచ్చ నేత ఇంటికెళ్లి నోట్ల నైవేద్యం
రూ.500, రూ.వెరుు్యనోట్ల రద్దు, బ్యాంకుల లావాదేవీల్లో ఆంక్షలు, డబ్బు తీసుకునేందుకు పరిమితులు వెరసి సామాన్య, మధ్యతరగతి ప్రజల కష్టాలు చెప్పనలవి కాకున్నారుు. రెండు, మూడు రోజులు ఒకింత ఇబ్బంది పడినా ఆ తర్వాత సర్దుకుంటుంది.. అనే పరిస్థితి దాటిపోరుు విపరిణామాలు చోటుచేసుకుంటున్నారుు. అటు బ్యాంకులు.. ఇటు ఏటీఎంలు.. నరకానికి కేరాఫ్ అడ్రస్‌లుగా మారిపోయారుు. ఉదయం లేచింది మొదలు.. అర్ధరాత్రి దాటే వరకు ఏటీఎంల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు గత పన్నెండు రోజులుగా కనిపిస్తూనే ఉన్నారుు. పాలకులు సృష్టించిన కరెన్సీ సంక్షోభంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలతో పాటు ఓ రకంగా బ్యాంకు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన రద్దీ తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అరుుతే కొంతమంది బ్యాంకర్లు మాత్రం ఇదే అదనుగా అధికార పార్టీ నేతల సేవలో తరించడమే వివాదాస్పదమవుతోంది. ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అల్లాడిపోతుంటే.. కొందరు బ్యాంకర్లు మాత్రం టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ నోట్ల కట్టలతో చక్కర్లు కొడుతున్నారట. ప్రధానంగా నగరంలోని ఓ టీడీపీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లిన ముగ్గురు బ్యాంకు అధికారులు.. మీకు ఏ విధంగా సహాయపడగలమంటూ సాగిల పడి పాత నోట్లను తీసుకొని కొత్త నోట్లు ఇచ్చి వచ్చారని అంటున్నారు.
బెల్టు బాబుగా పేరొందిన సదరు నేత నగరంలోని లిక్కర్ సిండికేట్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. అతని వద్ద మూలుగుతున్న బ్లాక్‌ను వైట్ చేసేందుకు కూడా తగిన సలహాలు ఇచ్చి సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది. బ్యాంకర్లతో పాటు జ్యయెలరీ షాపుల యజమానులు కూడా ఆయన ఇంటికి వెళ్లి ఇతోధికంగా సాయపడినట్టు చెబుతున్నారు. వ్యాపారుల సంగతి పక్కనపెడితే బాధ్యత కలిగిన బ్యాంకర్లు ఆయన ఇంటికి వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. నలుపు టు తెలుపు వయా పసుపు వ్యవహారం కేంద్ర ఇంటెలిజెన్‌స వర్గాలకు కూడా చేరడంతో విచారణ చేపట్టినట్టు చెబుతున్నారు. నవ్యాంధ్రలో నడిచే ప్రభుత్వం మాదే.. అని బీరాలు పోయే వర్గానికి చెందిన ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఎటూ రాష్ట్ర ఇంటెలిజెన్‌స వర్గాలు నివేదికలివ్వలేవు.. అరుుతే ఇక్కడ కేంద్ర ఇంటెలిజెన్‌స అధికారులు ఆరా తీసిన పరిస్థితుల్లో సదరు నేత కలుగులోని నల్లడబ్బు కొంతైనా వెలుగులోకి వస్తుందా!.. ఏమో చూద్దాం.