తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ విమానంలో ప్రయణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష‍్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా అని సర్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు.
You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed.
— Sarvapriya Sangwan (@DrSarvapriya) January 8, 2023
This kind of negligence is unacceptable. #airIndia pic.twitter.com/L3lGxgrVbz
ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా జేఆర్‌డీ సంస్థ.. అంతర్జాతీయ గౌరవం పొందింది. ఇప్పుడు మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? నిర్వహణ లోపమా? అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ఆ రాయి ఉన్న ఆహారం తని మీ పన్ను విరిగిపోయి ఉంటుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
మహిళ ట్వీట్‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణమే క్యాటరింగ్ టీం దృష్టికి దీన్ని తీసుకెళ్తామంది. తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు అభినందించింది.
చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment