మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ధర్నా | Marched to run midday meals | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ధర్నా

Published Thu, Jul 28 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

Marched to run midday meals

సూర్యాపేట మున్సిపాలిటీ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదుట బుధవారం ధర్నా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని విద్యార్థులు, సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ సూర్యాపేట డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పోలెబోయిన కిరణ్‌కుమార్, వీరబోయిన లింగయ్య పాల్గొని మాట్లాడారు.     కార్యక్రమంలో ఉదయ్, ప్రవీణ్, సతీష్, నవీన్, రాఘవేంద్ర, కల్పన, భార్గవి, స్వాతి, ఫాతిమా  పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement