కొత్త అల్లుడు అత్తారింటికి వస్తే వారికి మర్యాదలు ఆకాశాన్నంటుతాయి. కొత్త బట్టలు, కానుకలతోపాటు పిండి వంటలతో అల్లుడికి మొహం మొత్తేలా చేస్తారు కొందరు అత్తా మామలు. ఈ క్రమంలోనే భోజనంలోకి పలు రకాల కూరలు, రకారకాల స్వీట్స్, పిండివంటలతో అరిటాకు వేసి మరీ వడ్డించేస్తారు. ఈ పద్దతి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అల్లుడు ఎప్పుడొచ్చినా వారికి ఇలా స్వాగతం పలుకుతారు అత్తింటివారు. ఆంధ్రాకు చెందిన ఓ అత్తగారు కూడా ఇటీవల పెళ్లైన తన కూతురు, ఆమె భర్త(అల్లుడు) కోసం తమ పద్దతిలో మర్యాద చేయాలనుకున్నారు. ఇంటికి వస్తున్న అల్లుడి కోసం ఏకంగా 67 రకాల వంటలు వండి 5 కోర్స్ మీల్స్ అరిటాకును సిద్దం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: అడవి గుండా 30 ఏళ్లుగా 15 మైళ్లు నడుస్తూ..)
ఈ వీడియోను అనంత్ రూపనగుడి అనే ట్విటర్ యూజర్ గురువారం షేర్ చేశాడు. అందులో ప్రతి వంటకాన్ని చూపిస్తూ వివరించిన ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరి నోట్లో నీళ్లూరాల్సిందే. ఈ 67 రకాల వంటకాల్లో చాట్స్, ఎన్నో రకాల భిన్నమైన స్వీట్స్, వెల్‌కం డ్రింక్, మెయిన్ కోర్స్, స్నాక్స్‌తో పాటు డిసెర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోకు ఇప్పటి వరకు 68 వేలకు పైగా వ్యూస్ రాగా, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘వెంటనే ఈ మీల్స్‌ను నాకు కూడా పంపించండి, ఒకవేళ అలా చేయకపోతే తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment