భోజన విరామంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు
కర్నూలు, ఆలూరు: మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ నాయకుల మధ్య బాహాబాహీకి వేదికైంది. తమలో విభేదాలు లేవని చెబుతూ సమావేశం ప్రశాంతంగా ముగిసిందని ఊపిరి పీల్చుకున్న కొద్ది సేపటికే భోజనం చేసే విషయంలో పరస్పరం తోసుకుని గొడవకు దిగారు. ఆలూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వీరభద్ర గౌడ్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ జయరాములు జెడ్పీటీసీ సభ్యుడు రాంభీం నాయుడు అన్నీ మండలాల కన్వీనర్లు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం భోజనం చేసే క్రమంలో ‘అప్పుడే ఆకలైందా..’ అంటూ పరస్పరం గొడవ పడ్డా రు. వాసవీ కల్యాణ మండపంలోనే పిడిగుద్దులు గుద్దుకున్నారు. తిండి కోసం గుద్దులాడుకోవద్దం టూ సీనియర్ నాయకులు సర్ధిచెప్పినా వినలేదు. వీరభద్ర గౌడ్ ముఖ్య అనుచరుడు నారాయణ, చింతకుంట సింగిల్ విండో అధ్యక్షుడు జయానంద రెడ్డి తనయుడు రఘు ప్రసాద్‌రెడ్డి మధ్య ఈ గొడవ జరిగింది. చివరకు ఎవరికి వారు తాము కావాలో వాళ్లు కావాలో తేల్చుకో అంటూ గౌడ్ వద్ద పంచాయితీ పెట్టారు. కార్యాలయంలో మాట్లాడుకుందామంటూ గౌడ్ వారికి సర్ధిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment