బరువు తగ్గడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటాం. వ్యాయమాలు, డైట్‌లని ఒకటి కాదు. ఎక్కడ ఏ తేడా కొడుతోందో గానీ బరవు తగ్గక భారంగా నిట్టూర్చుతాం. అయితే ఇలాంటి విషయంలో పోషకాహర నిపుణులు సహాయం తప్పనిసరి. అందుకోసం ఎలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలో సోషల్ మీడియాలో ఓ ప్రముఖ పోషకాహర నిపుణురాలు దీప్సిఖా జైన్ వివరించారు. మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో అన్ని పోషకాలు ఉండేలా బ్యాలెన్సింగ్‌గా తీసుకుంటే చాలని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ బ్యాలెన్సింగ్ ప్లేట్ మీల్స్ టెక్నిక్..!.
మనం తీసుకునే ప్లేట్ మీల్స్‌లో ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటాం. ఐతే ఇలా ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెబుతున్నారు పోషకాహార నిపుణులు దీప్సిఖా జైన్. ముఖ్యంగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గిస్తే ఎక్కువ సానూకూల మార్పులు చూడగలమని అన్నారు. అందుకోసం ప్లేట్ భోజనంలో కొద్ది మార్పులు చేయమని సూచిస్తున్నారు.
ఇంట్లో వండిన రోటీలు, అన్నం అయితే అతిగా తినేస్తాం. అలాగే బరువు కూడా పెరిగిపోతారు. కాబట్టి సమతుల్యంగా ప్లేట్ మీల్స్ ఉండేలా చూడాలి. అంటే.. స్థూల, సూక్ష్మ పోషకాలను చేర్చడం తోపాటు మనసు పెట్టి తినడం వంటివి కూడా చేయాలని చెప్పారు. బరువు తగ్గేందుకు మన భోజనం ప్లేట్‌లో నాలుగు రకాలుగా ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.
మొదటిది సలాడ్‌తో ప్రారంభించాలి, పచ్చికూరగాయలతో చేసిన ఓ కప్పు సలాడ్‌తో ప్రారంభించాలి. ఇది మంచి బ్లడుషగర్కి దోహదపడుతుంది.
రెండోది ప్రోటీన్‌తో భర్తీ చేయాలి అంటే పప్పు, పనీర్ సబ్దీ లేదా నచ్చనీ ప్రోటీన్ మూలం తప్పనిసరి
మూడోది ప్రోబయోటిక్స్ లేదా ప్రీబయోటిక్స్ మూలంతో నింపాలి. అంటే రైతా లేదా పెరుగుతో తీసుకోవచ్చు. ఇది జీర్ణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
నాలుగు కార్బోహైడ్రేట్ల కోసం చివరగా మల్టీగ్రెయిన్ రోటీని ఎంచుకోవాలి. ఇలా తీసుకుంటే కార్బోహైడ్రేట్లపై నియంత్రణ ఉంటుంది.
ఈ నాలుగింటిని తప్పనిసరిగా ప్లేటు భోజనంలో ఉండేలా చూసుకుంటే అన్ని రకాల పోషకాలు విటమిన్లు శరీరానిక అందడమే కాకుండా బుద్దిపూర్వకంగా తింటారు. పైగా అధికా కేలరీలను తీసుకోకుండా నియంత్రించగలుగుతాం. ఇది ఒక రకరంగా ఆరోగ్యకరమైన రీతీలో భోజనం తీసుకునేందుకు సహాయపడుతుంది కూడా అని చెబతున్నారు పోషకాహార నిపుణురాలు దీప్సిఖా జైన్.
Comments
Please login to add a commentAdd a comment