ఓ ఒంటరి తల్లి రెస్ట్ తీససుకునే వయసులో ఆటో నడుపుతూ ఎందరికో ప్రేరణగా నిలిచింది. చెట్టంత కొడుకు ఉండి కూడా అనాథలా తన పొట్ట పోషించుకోవడానికి ఆటో డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. అందులో ఎదురయ్యే సవాళ్లను లెక్కచేయకుండా యోధురాలి వలే రాత్రిళ్లు కూడా ఆటో నడుపుతోంది. పైగా అడుక్కోవడం తప్పుగాని పనిచేసుకుని బతకడం తప్పుకాదని చెబుతుండటం విశేషం.
అందుకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో 55 ఏళ్ల ఓ మహిళ ఆటోను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్‌గా అర్థరాత్రి సమయాల్లో తిరగడం కష్టమైనా ఉక్కు సంకల్పంతో ధీశాలిగా ఆటోని నడుపుకుంటూ వెళ్లడం విశేషం. తన కొడుకు తనను గౌరవించకపోగా డబ్బుకోసం తనతో గొడపడుతున్నాడనే విషయాన్ని చెప్పుకొచ్చింది. బహుశా నా పెంపకంలోని లోపం అయ్యి ఉండొచ్చని బాధగా చెప్పింది.
ఆమె తన భర్తను కోల్పోవడం వల్ల ఇలా రోడ్డు మీదకు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ వృత్తి చేసేందుకు నామూషీగా అనిపించలేదా అని అడగగా..అడుక్కోవడం సిగ్గు కానీ, ఏదో పనిచేసుకుంటున్నప్పుడూ సిగ్గు ఎందుకు అని ఎదురు ప్రశ్న వేస్తోంది. కష్టాల్లో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరించిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ఆయుష్ గోస్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ ఆ తల్లి గొప్ప యోధురాలు అని, మరికొందరూ..ఆమె కొడుకు మనిషిగా విఫలమయ్యాడు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 'అమ్మ చేతి వంటే కంఫర్ట్ ఫుడ్'..!)
Comments
Please login to add a commentAdd a comment