అవకతవకలకు పాల్పడితే చర్యలు
అవకతవకలకు పాల్పడితే చర్యలు
Published Sun, Aug 7 2016 1:17 AM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
హెచ్‌ఎంలకు విద్యాశాఖ ఆదేశాలు
భక్తి ముసుగులో చేస్తున్న వ్యాపారాన్ని ఆపాలి: ఎస్‌ఎఫ్‌ఐ
‘సాక్షి’ కథనాలకు స్పందన
కంబాలచెరువు : స్కూలు పిల్లలకు ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్నం భోజనంలో అవకతవకలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా«ధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి నర్సింహరావు ఆదేశాల మేరకు మ«ధ్యాహ్న భోజనం అమలవుతున్న స్కూల్ హెచ్.ఎం.లతో స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఇస్కాన్ భోజ నం అమలు తీరుపై సమీక్షించారు. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో శనివా రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీవైఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇస్కాన్ భోజనం అమలుతీరు, నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులకు ఖచ్చితంగా నిర్వహించాలని, దీన్ని మ«ధ్యా హ్న భోజన కమిటీలు పర్యవేక్షించాలన్నా రు. తొమ్మిది, పదో తరగతి వేరే స్కూళ్లలో చేరిన వి ద్యార్థుల జాబితాలను వెంటనే అందజేయాలన్నారు. కార్యక్రమంలో అర్బన్ స్కూల్ డీఐ అయ్యం కి తులసీదాస్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
భక్తి ముసుగులో...
భక్తి ముసుగులో పిల్లల కడుపు మాడుస్తున్న ఇస్కాన్ భోజనాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ‘సాక్షి’లో వస్తున్న కథనాలను చూసిన విద్యార్థి సంఘాలు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ఉద్యమ కార్యచరణ ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాజులోవ, జిల్లా అధ్యక్షుడు బి.పవన్ మాట్లాడుతూ అ«ధ్యాత్మిక సంస్థ పేరుతో గత ఏడాది వరకు పౌష్టికాహారమైన గుడ్డు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధన ఉన్నా నాసిరకం అరటిపండు, ముద్ద అన్నం, నీళ్ల సాంబారు, నీళ్ల మజ్జిగ స్కూళ్ల వద్ద ఇస్కాన్ సిబ్బంది పడేసి వెళ్లిపోతున్నారన్నారు. ఆ భోజనం బాగోలేకపోయినా బాగుందని హెచ్‌ఎమ్‌లు నివేదికలు పంపడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలోను పలు ఫిర్యాదు వచ్చి నా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. మీడియా వచ్చిన కథనాలు చూసి మేయర్ పంతం రజనీశేషసాయి ప్రత్యక్షంగా చూసి «ధ్రువీకరించారంటే ఇంతకంటే సాక్ష్యం ఏమికావాలన్నారు. చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు.
Advertisement