midday
-
గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో మధ్యాహ్న పథక కార్మికులు డిమాండ్ కాకినాడ సిటీ : మధ్యాహ్న భోజనపథకానికి కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని పథకం కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వారు బుధవారం ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పథక కార్మికులు సుమారు రెండుగంటలపాటు కలెక్టరేట్ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ నుంచి డీఈవో కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. వర్కర్లు, హెల్పర్లకు కనీసవేతనం రూ.5వేలు ఇవ్వాలని, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వంట చేసే కార్మికులకు బిల్లులు సకాలంలో అందక సరుకుల కోసం అప్పు తెచ్చి వండేపరిస్థితి ఉందన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం.వీరలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు సత్తిరాజు, కార్మికులు పాల్గొన్నారు. -
వికటించిన మధ్యాహ్నభోజనం
ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత ధర్మపురి : కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు అన్నంతోపాటు ఆలుగడ్డ కూర, సాంబారుతో మధ్యాహ్నభోజనం పెట్టారు. పాఠశాలలో మొత్తం 82 మంది విద్యార్థులుండగా 70 మంది భోజనం తిన్నారు. ఆహారం తిన్న గంట వ్యవధిలోనే ఒక్కొక్కరికి వాంతులు మొదలయ్యాయి. తర్వాత కడుపునొప్పంటూ పలువురు విద్యార్థులు పడిపోయారు. వీరిలో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిగా పాఠశాలకు చేరుకున్నారు. కొందరిని ఆటోల్లో, మరి కొందరిని 108లో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీహెచ్వో వసంతరావు ఆధ్వర్యంలో వైద్యులు ఇందు, శ్రీపతి విద్యార్థులు చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఎం.రాజు, ఎం.మౌనిక, ఎం.స్రవంతి, సీహెచ్.మధుకర్, ఎం.విఘ్నేష్, పి.రాజేశ్వరి, వి.నిథిన్లున్నారు. విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ వైద్యులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పీఏసీఎస్ ౖచెర్మన్ బాదినేని రాజేందర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని సమీక్షించారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
హెచ్ఎంలకు విద్యాశాఖ ఆదేశాలు భక్తి ముసుగులో చేస్తున్న వ్యాపారాన్ని ఆపాలి: ఎస్ఎఫ్ఐ ‘సాక్షి’ కథనాలకు స్పందన కంబాలచెరువు : స్కూలు పిల్లలకు ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్నం భోజనంలో అవకతవకలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా«ధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి నర్సింహరావు ఆదేశాల మేరకు మ«ధ్యాహ్న భోజనం అమలవుతున్న స్కూల్ హెచ్.ఎం.లతో స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఇస్కాన్ భోజ నం అమలు తీరుపై సమీక్షించారు. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో శనివా రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీవైఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇస్కాన్ భోజనం అమలుతీరు, నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులకు ఖచ్చితంగా నిర్వహించాలని, దీన్ని మ«ధ్యా హ్న భోజన కమిటీలు పర్యవేక్షించాలన్నా రు. తొమ్మిది, పదో తరగతి వేరే స్కూళ్లలో చేరిన వి ద్యార్థుల జాబితాలను వెంటనే అందజేయాలన్నారు. కార్యక్రమంలో అర్బన్ స్కూల్ డీఐ అయ్యం కి తులసీదాస్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. భక్తి ముసుగులో... భక్తి ముసుగులో పిల్లల కడుపు మాడుస్తున్న ఇస్కాన్ భోజనాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ‘సాక్షి’లో వస్తున్న కథనాలను చూసిన విద్యార్థి సంఘాలు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ఉద్యమ కార్యచరణ ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాజులోవ, జిల్లా అధ్యక్షుడు బి.పవన్ మాట్లాడుతూ అ«ధ్యాత్మిక సంస్థ పేరుతో గత ఏడాది వరకు పౌష్టికాహారమైన గుడ్డు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధన ఉన్నా నాసిరకం అరటిపండు, ముద్ద అన్నం, నీళ్ల సాంబారు, నీళ్ల మజ్జిగ స్కూళ్ల వద్ద ఇస్కాన్ సిబ్బంది పడేసి వెళ్లిపోతున్నారన్నారు. ఆ భోజనం బాగోలేకపోయినా బాగుందని హెచ్ఎమ్లు నివేదికలు పంపడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలోను పలు ఫిర్యాదు వచ్చి నా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. మీడియా వచ్చిన కథనాలు చూసి మేయర్ పంతం రజనీశేషసాయి ప్రత్యక్షంగా చూసి «ధ్రువీకరించారంటే ఇంతకంటే సాక్ష్యం ఏమికావాలన్నారు. చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. -
మధ్యాహ్న భోజనానికి మంగళం
సత్యదేవ డిగ్రీ కళాశాలలో దూరప్రాంత విద్యార్థుల అవస్థలు గత ఏడాది ఈ పథకాన్ని ప్రారంభించిన అన్నవరం దేవస్థానం అన్నదానం నిధులను దీనికి వెచ్చించరాదన్న ఉన్నతాధికారులు ఎలాగైనా కొనసాగించాలని కోరుతున్న విద్యార్థులు అన్నవరం : దూరప్రాంత విద్యార్థుల కోసం సత్యదేవ డిగ్రీ కళాశాలలో గత ఏడాది ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని అన్నవరం దేవస్థానం నిలిపివేసింది. దీంతో దూరప్రాంత విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుంచి క్యారియర్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తరగతులకు ఆలస్యమవుతోందని వాపోతున్నారు. 400 మంది విద్యార్థులకు ప్రయోజనం అన్నవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యదేవ డిగ్రీ కళాశాలలో 630 మంది చదువుతున్నారు. వీరిలో 400 మంది శంఖవరం, రౌతులపూడి, తొండంగి, తుని మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి వస్తున్నారు. వారి తల్లితండ్రులు చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలుగా ఉంటూ తమ పిల్లలను కళాశాలలో చదివిస్తున్నారు. కాయకష్టంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి.. ఉదయాన్నే తమ పిల్లలకు భోజనం తయారు చేసి ఇవ్వడం ఇబ్బందికరమే. ఇంట్లో వంట పూర్తయిన తరువాత క్యారియర్ సర్దుకుని, సుమారు పది పదిహేను కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ విద్యార్థులు రావాల్సిన పరిస్థితి. దీంతో వారు కళాశాలకు ఆలస్యంగా వస్తున్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ 400 మంది విద్యార్థులకు అన్నదానం పథకం నిధులతో మధ్యాహ్న భోజనం పెట్టాలని దేవస్థానం నిర్ణయించింది. గత ఏడాది అక్టోబర్ ఏడో తేదీన అప్పటి దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్‌తో కలిసి ఈఓ కె.నాగేశ్వరరావు ఈ పథకాన్ని ప్రారంభించారు. గత మార్చి వరకూ దీనిని అమలు చేశారు. అన్నదాన పథకం ని««దlులను విద్యార్థుల భోజనానికి వెచ్చించడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఇందుకు అనుమతి నిరాకరించారు. ఫలితంగా ఈ పథకాన్ని అర్ధంతరంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తే మేలు కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసి ఉంటే ఈ ఇబ్బంది తలెత్తి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 400 మంది విద్యార్థులకు భోజనం అంటే రోజుకు కనీసం రూ.10 వేల ఖర్చవుతుంది. ఏడాదికి ఎనిమిది నెలలు కళాశాల పని చేస్తుందనుకుంటే మధ్యాహ్న భోజనానికి సుమారు రూ.25 లక్షలు అవసరం. దేవస్థానం 50 శాతం కేటాయించి, మిగిలిన మొత్తాన్ని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్ ద్వారా ఈ పథకాన్ని కొనసాగిస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. సాంకేతిక కారణాలతోనే.. డిగ్రీ కళాశాలలో మ«ధ్యాహ్న భోజనం పథకాన్ని సాంకేతిక కారణాలతో నిలిపివేయాల్సి వచ్చింది. అన్నదాన పథకం నిధులతో ఈ పథకాన్ని నిర్వహించాలని అనుకున్నా సాధ్యపడలేదు. అన్నదాన పథకంలో బయోమెట్రిక్ పద్ధతి ప్రవేశపెట్టడంతో రోజూ ఎంతమంది భోజనం చేస్తున్నారో స్పష్టంగా లెక్క తెలుస్తోంది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం.– కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం