నిద్రలేమితో బాధపడుతుంటే...
హెల్త్‌టిప్స్
ఒక గ్లాసు వేడిపాలలో ఒక టీ స్పూన్ తేనె కలిపి రాత్రి పడుకోవడానికి అరగంట ముందుగా తాగితే బాగా నిద్రపడుతుంది. పాలతో అరిపాదాలకు మసాజ్ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకుని తలకు పట్టించి, పది నిమిషాల సేపు మర్దన చేసి తలస్నానం చేస్తుంటే నిద్రలేమి సమస్య బాధించదు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది. {పతిరోజూ రాత్రి అర కప్పు సొరకాయ రసంలో, అంతే మోతాదులో నువ్వులనూనె కలిపి తలకు మర్దన చేయాలి. అలాగే సొరపాదు ఆకులను ఉడకబెట్టి ఆహారంతోపాటు తీసుకుంటే కూడా మంచి ఫలితాన్నిస్తుంది కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి.
350 ఎం.ఎల్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు లేదా సోంపు పొడి వేసి మరిగించాలి. పాత్రకు మూత పెట్టి సన్న మంట మీద పదిహేను నిమిషాల సేపు ఉడికించి, వడపోసి, వేడిగా కాని గోరువెచ్చగా కాని తాగాలి. రుచికోసం తగినంత తేనె, పాలను కూడ కలుపుకోవచ్చు. ఈ టీని రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు తాగవచ్చు.