తండ్రుల ద్వారానే స్థూలకాయం
పరిపరి... శోధన
స్థూలకాయానికి అతి భోజనం, తక్కువ పని కారణాలే అయినా, పిల్లలు స్థూలకాయులుగా మారితే, అందుకు కారణం వారి తండ్రులేనని డెన్మార్క్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్థూలకాయానికి సంబంధించిన జన్యువులు తండ్రి వీర్యం ద్వారానే పిల్లలకు సంక్రమిస్తాయని తమ పరిశోధనల్లో తేలిందని కోపెన్‌హాగన్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ బారెస్ వెల్లడిస్తున్నారు.
పిల్లలు స్థూలకాయులుగా మారకుండా ఉండాలంటే కొవ్వులు అతిగా తినకూడదని, మద్యానికి, పొగతాగడానికి దూరంగా ఉండాలని గర్భిణులకు నానా జాగ్రత్తలు చెబుతుంటారని, వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తండ్రులు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారి పిల్లలు కూడా భవిష్యత్తులో అలాగే తయారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.