మిల్లెట్‌ మీల్‌తో ఆరోగ్యం.. | Health Benefits of Millet | Sakshi
Sakshi News home page

మిల్లెట్‌ మీల్‌తో ఆరోగ్యం..

Jun 30 2024 9:47 AM | Updated on Jun 30 2024 9:47 AM

Health Benefits of Millet

చిరుధాన్యాలకు పెరిగిన డిమాండ్‌ 

వంటల పట్ల నగరవాసుల ఆసక్తి 

మార్కెట్‌లోకి వివిధ రకాల ఉత్పత్తులు 

పంట పాతదే.. వంటే కొత్తది..

అందుబాటులో రెడీ–టు ఈట్, రెడీ–టు కుక్‌

ఒకప్పుడు గ్రామీణ ప్రాంత్రాలకే పరిమితమైన చిరుధాన్యాల వంటలు నేడు పట్టణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వాటికి బాగా డిమాండ్‌ పెరిగింది. ఒకప్పుడు సంప్రదాయ వంటలైన అన్నం, రొట్టెలకే పరిమితమైన చిరుధాన్యాల (మిల్లెట్స్‌)తో ఇప్పుడు వివిధ రకాల తినుబండారాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక చిరుతిండ్లను తీసుకుంటుంటాం. ప్రస్తుతం నగరవాసులు ఆరోగ్యాన్ని దృష్టిలో      ఉంచుకుని నగర వాసులు వాటి స్థానంలో ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీంతో పాటు నగరవాసుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు ఉత్పత్తిదారులు.. రెడీ–టు ఈట్, రెడీ–టు కుక్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నారు.. ఈ చిరుధాన్యాల కథేంటి? వాటితో ఎలాంటి      ఆహారాన్ని తయారు చేస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకుందాం..   

రోనా పుణ్యమా అని నేడు చాలామంది ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ పాకగా, చిరుధాన్యాల పంటలు, వంటకాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రతిదీ కాలుష్యానికి గురవ్వడం, కల్తీ అవ్వడంతో ఆరోగ్యకరమైన ఆహారానికే మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఆరోగ్యకరమైన ఆహారం ప్రస్తుత పరిస్థితుల్లో మిల్లెట్లు, చిరుధాన్యాలతోనే సాధ్యమని భావించి   ఆ తరహా వంటకాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.

ఐకరాజ్యసమితి గుర్తింపు... 
మిల్లెట్స్‌కి ఉన్న ప్రాధాన్యతను భారతదేశం ఐక్యరాజ్యసమితి ముందు పెట్టగా 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ డేగా ప్రకటించింది. భారత్‌ను మిల్లెట్స్‌ దేశంగా 74 దేశాలు గుర్తించాయి. దీనికి ముందే భారత్‌ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా గుర్తించింది. అంతకుమునుపు 2018లో జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి, ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు దీనిపై అవగాహన కలి్పంచడం ప్రారంభించింది. ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో 2023ను అంతర్జాతీయ సంవత్సరంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరగా 74 దేశాలు గుర్తించాయి. దీంతో ప్రపంచ దేశాల్లో కూడా మిల్లెట్స్‌కు డిమాండ్‌ పెరిగింది.

పాత పంటలు.. కొత్త వంటలు
మిల్లెట్స్‌ పాత తరం పంటలైనా వాటితో కొత్త రకం వంటలు చేసి.. న్యూట్రిషనల్‌ వ్యాల్యూస్‌తో ఈ తినుబండారాలు రూపొందిస్తున్నారు. మిల్లెట్స్‌ను ద్వితీయ పద్ధతల్లో ప్రాసెసింగ్‌ చేసి ఈ ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు రెడీ–టు– ఈట్, రెడీ–టు–కుక్‌ అనే పద్ధతుల్లో కొత్త వంటకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తున్నారు.

  400 అంకుర సంస్థలు 
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మిల్లెట్స్‌తో వివిధ రకాల తినే వస్తువులను తయారు చేయడానికి 400 రకాల కంపెనీలు పనిచేస్తున్నాయి. చిరుధాన్యాల విలు వలతో కూడిన పలు ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.

ఏవి చిరుధాన్యాలు... 
జొన్నలు, రాగులు, సజ్జలు, సామలు, హరికలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు మొదలైన వాటిని భారత దేశంలోనే సంప్రదాయ పంటలుగా పండిస్తుంటారు. గతంలో వీటినే ఎక్కువగా ఆహారంగా వాడేవారు.. అయితే నూతన వంగడాలు అందబాటులోకి రావడంతో వాటిపై దృష్టి మరల్చారు. అవగాహన పెరగడంతో ప్రస్తుతం సంప్రదాయ పంటలవైపే చూపు మరల్చి నూతన పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు రాబడుతున్నారు రైతులు. తీనికితోడు ఈ పంటలకు డిమాండ్‌ పెరగడంతో అదే పద్ధతులను అవలంభిస్తున్నారు.  

మార్కెట్‌లో మిల్లెట్స్‌ ఉత్పత్తులు.. 
రాగి నుండి మాల్ట్, చిరుధాన్యాల నుంచి పఫ్స్, స్నాక్స్, జొన్న ఇడ్లీమిక్స్, ఉప్మా, దోస, పొంగల్, లడ్డూ మిక్స్, జొన్న ముయోస్లీ, పాస్తా, కుకీలు, బ్రెడ్, బన్, కేక్, పిజ్జా, ఐస్‌క్రీం, జొన్న పేలాలతో పాటు, జొన్న పంటలో అనేక రకాల వంటకాలను తయారు చేస్తున్నారు.

జొన్న ముడి పదార్థాలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది అన్ని వయస్సుల వారికీ అనుకూలమైన ఆహారం. జొన్నలో మెగ్నీషియం, ఐరన్, జింక్, పీచుతో కూడిన ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. జొన్న రోల్స్, జొన్న బూందీ లడ్డు, సమోస, వడ, అరిసెలు, షర్‌బత్‌ కూడ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం 12,600 టన్నుల చిరుధాన్యాల పదార్థాలు ప్రతి రోజు ప్రజలు తింటున్నారు.చిరు«ధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్‌
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఐసీఎఆర్, 


భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ 
లాంటివి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో వీటికి భారీగా  డిమాండ్‌ పెరిగింది. ముందు ముందు చిరుధాన్యాలు, మిటెల్స్‌కు మంచి ఆదరణ ఉంటుంది. అనేక రకాల స్నాక్స్‌ తయారు చేసి రెడీగా ఉంచుతున్నాం. అప్పటికప్పుడు తినడానికి, వండుకోవడానికీ అనుకూలంగా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నాం.. 
– డాక్టర్‌ బి.దయాకర్‌ రావు, సీఈఓ న్యూట్రీహబ్, ఐఏఎంఆర్‌ రాజేంద్రనగర్‌

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం.. 
ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో చిరుధాన్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దీనికితోడు నూతన పద్ధతుల్లో వీటిని పండించడానికి ప్రభుత్వం పోత్సాహం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అంకుర సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా చిరుధాన్యాలతో న్యూట్రిషన్‌ ఫుడ్‌ తయారు చేస్తూ ప్రజలకు అందుబాటులో, రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో డిమాండ్‌ కలి్పస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంలో చిరుధాన్యాల ఉత్పత్తులు తయారువుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement