ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత | Three students sick in Kasturba Gandhi College | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత

Published Thu, Jul 21 2016 6:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Three students sick in Kasturba Gandhi College

నర్మేట కస్తూర్బాగాంధి విద్యాలయంలో గురువారం మరో ముగ్గురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. నంగునూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి సదానందం పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులకు మందులు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సందర్భంగా పాఠశాల ఎస్‌ఓ హమీదా, వైద్య సిబ్బంది విద్యార్థుల గదుల్లో నిల్వ ఉంచిన తినుబండారాలను గుర్తించి వాటిని తొలగించారు. అనంతరం డాక్టర్ సదానందం మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లో నుంచి తెచ్చుకున్న అప్పడాలు తినడం వల్ల కడుపు నొప్పి, వీరేచనాలు అయ్యాయన్నారు. విద్యార్థులు కోలుకుంటున్నందున ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement