ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా యువతరంగం డిగ్రీ కాలేజి క్రీడోత్సవాల్లో మహిళల అథ్లెటిక్స్ మీట్‌లో కస్తూర్బా గాంధీ కాలేజికి చెందిన అథ్లెట్ పి.శ్రీలత సత్తా చాటింది. ఆమె 100 మీ., 200 మీ. రేసుల్లో స్వర్ణ పతకాలు సాధించింది. జింఖానా మైదానంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
అథ్లెటిక్స్ మహిళల విభాగం: ఫైనల్స్ ఫలితాలు: 100 మీటర్లు: 1.పి. శ్రీలత( కస్తూర్బా గాంధీ కాలేజి), 2. ఝాన్సీ(సెయింట్ ఫాన్సిస్ కాలేజి), 3.కె.మహేశ్వరీ (ఐపీజీడీసీ). 200మీటర్లు: 1.పి.శ్రీలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.టి.మీనా (జీడీసీ), 3. జి.వరలక్ష్మీ (కస్తూర్బా గాంధీ కాలేజి). 400 మీటర్లు: 1.హేమలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. బి.రాణి (జీడీసీ), 3. మరియా ఝాన్సీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి). 800 మీటర్లు: 1.అమృత కుమారి(సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి), 2.కె.మహేశ్వరీ (ఐపీజీడీసీ), 3.టి.జ్యోతి (జీడీసీ). లాంగ్‌జంప్: 1.కె.అచ్యుత కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.మరియా ఝాన్సీ (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి), 3.సి.అమృత కుమారి (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి). షాట్‌ఫుట్: 1.కాజల్ సింగ్రోహ (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.ఆర్.కోమల్ (కస్తూర్బా గాంధీ కాలేజి), 3.ఎం.గాయత్రి (జీడీసీ).
సిటీ కాలేజికి టైటిల్
పురుషుల వాలీబాల్ టీమ్ టైటిల్‌ను ప్రభుత్వ సిటీ కాలేజి జట్టు చేజిక్కించుకుంది. జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు శుక్రవారం సిటీ కాలేజి జట్టు 25-20, 25-12 స్కోరుతో వివేకవర్ధిని(వీవీ) డిగ్రీ కాలేజి జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్స్‌లో సిటీ కాలేజి జట్టు 25-12, 25-21తో ఎస్‌పీ కాలేజిపై.. వీవీ కాలేజి 25-15, 25-10తో ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజిపై గెలిచాయి.
శ్రీలతకు రెండు స్వర్ణాలు
Published Sat, Nov 16 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement