ఈసారి కొత్తగా మరో 84 కేజీబీవీలు
- బాలుర కోసం 29 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు
- కేంద్ర పథకాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నివాస వసతితో కూడిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) 391 ఉండగా, వచ్చే జూన్ నుంచి మరో 84 కేజీబీవీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏ బీ) వీటికి ఓకే చెప్పింది. వాటిని వచ్చే జూన్ నుంచే ప్రారంభించాలని మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ సహకార పథకాలపై జరిగిన సమీక్షలో నిర్ణయించారు. వీటితోపాటు బాలుర కోసం కూడా మరో 29 కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటిలో 6, 7, 8 తరగతుల్లో బోధన ప్రారంభిస్తారు. ఒక్కో పాఠశా లలో ఇందుకుగాను 600 మందికి పైగా బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించనున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులను వెంటవెంటనే రాబట్టుకునే ప్రయత్నాలు చేయాలని, వాటిని సకాలంలో ఖర్చు చేసి వి నియోగ పత్రాలు సమర్పిం చాలని కడియం శ్రీహరి సూచించారు. ప్రస్తుతం ఉన్న కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫర్నిచర్, బెడ్ మెటీరియల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రొడక్టు కిట్‌లను విద్యార్థులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన 84 మండలాల్లో కేజీబీవీల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని, బాలుర కోసం కూడా 29 జిల్లా కేంద్రాల్లో బాలుర స్కూళ్లను ప్రారంభిం చాలన్నారు. వీటి ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని కోరామని, వారు సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ –2 కింద కొనసాగుతున్న పనులను ఈ ఏడాది జూన్ నెలాఖరు లోగా, ఆర్‌ఎంఎస్‌ఏ–3 కింద కొనసాగుతున్న పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.
మరో 6 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్
ఈసారి దాదాపు 6 వేల విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరును అమలు చేస్తామని కడియం చెప్పారు. స్కూళ్లలో టాయిలెట్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. టాయిలెట్ల నిర్వహణకు ఒక వర్కర్‌ను పెట్టుకునేందుకు ప్రత్యేకంగా రూ. 20 వేలు ఇస్తున్నామని, వంద నుంచి 300 లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఇద్దరిని నియమిం చేందుకు, నిర్వహణకు రూ. 50 వేలను ఇస్తామన్నారు. 500 కంటే ఎక్కువ మంది ఉ చోట ముగ్గురు వర్కర్లను పెట్టుకోవాలని, వాటికి రూ. 75 వేలు ఇస్తామని, పాఠశాలలు ప్రారంభయ్యే నాటికే తొలి ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తామన్నారు. కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్పీల వేతనాలు పెంపు యోచన ఉందనీ అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు.