Central schemes
-
ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు
శంషాబాద్ రూరల్: వచ్చే 25 ఏళ్లలో భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’కు శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లా చిన్నగోల్కొండలో జెండా ఊపి సంకల్ప రథాన్ని ప్రారంభించారు. దేశాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని, ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా.. అర్హులైన వారి చెంతకు పథకాలను ఈ రథం ద్వారా తీసుకెళ్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం వాయిదా పడిందని, ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభించిన యాత్రను జనవరి 25 వరకు కొనసాగిస్తామని, రథాన్ని ప్రతి ఊరుకు తీసుకువెళ్లి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. అలాగే అర్హులకు పథకాల మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు. మోదీ పాలనలో గత 9 ఏళ్లలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులు, మహిళా సంఘాలకు రుణాలు, పేదల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య చికిత్స, రైతులకు పెట్టుబడి సాయం, గూడు లేని పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత రేషన్, గ్యాస్ కనెక్షన్లవంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి డ్రోన్ మంజూరు.. రైతులు పంటలకు మందులు పిచికారీ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక మహిళా సంఘానికి డ్రోన్ సౌకర్యం సమకూర్చుతున్నట్లు మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత 15 వేల డ్రోన్లను ఇవ్వనున్నట్లు చెప్పారు. -
మోదీ హామీలపైనే ప్రజలకు భరోసా
న్యూఢిల్లీ: తప్పుడు హామీలతో విపక్షాలు సాధించేదేమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ వాస్తవాన్ని అవి ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ ఇచి్చన, ఇస్తున్న ‘మోదీ హామీలు’ దేశవ్యాప్తంగా ప్రజల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. ‘‘వాటిని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు చక్కని రుజువు’’ అని ప్రధాని వివరించారు. కేంద్ర పథకాలు ప్రజలందరికీ చేరేలా చూసేందుకు చేపట్టిన వికసిత్ సంకల్ప్ యాత్ర లబి్ధదారులతో శనివారం ఆయన ముచ్చటించారు. ఎన్నికల్లో నెగ్గడానికి ముందు ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలా అవసమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏ పారీ్టకైనా ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడం తెలివైన పని కాదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని, భావోద్వేగపూరిత బంధాన్ని ఏర్పాటు చేయగలిగాం. ప్రజలు తమదిగా భావిస్తున్న ప్రభుత్వం మాది. మోదీ ప్రతి ఒక్కరికీ సేవకుడు. పేదలను పూజిస్తాడు. వారి క్షేమం కోసం తపిస్తాడు. ప్రతి పేదా, తల్లి, చెల్లి, రైతు, యువతి, యువకుడు నాకు వీఐపీయే’’ వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలను ప్రజలు నమ్మకపోవడానికి అవి ఇస్తున్న తప్పుడు హామీలు, ప్రకటనలే కారణం. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వాళ్లు ప్రజా క్షేమాన్ని పట్టించుకుని ఉంటే వారికి నేడు ఇంతటి నిరాదరణ ఉండేదే కాదు. ఎన్నికల్లో గెలిచేది ప్రజాక్షేత్రంలోనే తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని విపక్షాలకు చురకలు అంటించారు. పక్కా ఇల్లు, తాగునీటి నల్లా, మరుగుదొడ్డి, ఉచిత వైద్యం, రేషన్, గ్యాస్, విద్యుత్, బ్యాంకు ఖాతాల వంటి సదుపాయాలు దేశ ప్రజలందరికీ అందుతున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. పీటీఐ ప్రధాన కార్యాలయం సందర్శన ఢిల్లీలో ఉన్న ప్రముఖ వార్తాసంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. కొత్తగా ప్రారంభించిన వీడియో సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఒక వార్తసంస్థ కార్యాలయానికి మోదీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి సీనియర్ ఎడిటోరియల్, ఎగ్జిక్యూటివ్ విభాగాల సిబ్బందితో మాట్లాడారు. మీడియాకు ఎదురయ్యే సవాళ్లు, మీడియాలో అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కేంద్ర పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ కొన్ని రాష్ట్రాలు తమకు లబ్ధి కలిగేలా కొత్త పేర్లు పెట్టడం ఇకపై కుదరదు. పార్లమెంట్ ఆమోదం పొందిన పథకాల పేర్లను మార్చడం అంటే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని, పాత్రను ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేయడమే అవుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, పథకాల పేర్లను మార్చే రాష్ట్రాలకు నిధులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై), పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేఏవై), ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు వివిధ రాష్ట్రాలు తమకు అనుకూల పేర్లను పెట్టి అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను పంజాబ్ ప్రభుత్వం ‘ఆమ్ ఆద్మీ క్లినిక్’లుగా మార్చింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని బంగ్లా ఆవాస్ యోజనగా మార్చి ఆ రాష్ట్ర సీఎం ఫోటోతో ప్రచారం చేసుకుంటోంది. ఢిల్లీలో దీనిని న్యూఢిల్లీ ఆవాస్ యోజన అని పిలుస్తున్నారు. అలాగే తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌ల్లోనూ ఈ పథకం పేరు మార్చారంటూ పార్లమెంట్ సమావేశాల్లో కొందరు ఎంపీలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నిబంధనలు పాటిస్తేనే నిధులు.. ఈ క్రమంలో కేంద్ర పథకాల పేర్లను మార్చకుండా నిబంధనల మేరకు అమలు చేస్తున్న రాష్ట్రాలకే నిధులు పొందే అర్హత ఉంటుందన్న షరతును కచి్చతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్‌కు కేంద్రం పెట్టిన పేరు మార్చాయి. ఇది నిబంధనల ఉల్లంఘనే. ఈ పద్ధతి నిధుల విడుదల నిలిపివేయడానికి దారి తీస్తుంది’అని హెచ్చరించడం గమనార్హం. చదవండి: మోయలేని రుణ భారంతో... దేశాలే తలకిందులు -
PM SHRI Scheme: ఇక 'బడి' జిటల్
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి తెలంగాణ నుంచి 1,200 స్కూళ్లను అధికారులు ప్రతిపాదించారు. ఒకవైపు ఆహ్లాదకర వాతావరణం, మరోవైపు ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందించనుంది. మౌలిక సదుపాయం.. మరింత సాయం పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు అంతర్జాల సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి ఈ నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్ దశ నుంచే ఒకేషనల్ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్ డేటానే ప్రామాణికం ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్ ప్లస్)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు. స్థానిక సంస్థల ఆమోదం తప్పనిసరి పీఎంశ్రీ పథకం ఆమోదానికి స్థానిక సంస్థల ప్రతినిధుల ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఓ కమిటీ పరిశీలిస్తుంది. పథకంలో చేరేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు, నిధుల వినియోగంపై ఆజమాయిషీకిగాను అవసరమైన కమిటీ ఏర్పాటును గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిగ్రామాల్లో రాజకీయకోణంలో దీనిపై ఇప్పటికీ సర్పంచ్‌లు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. వారికి అవగాహన కలి్పంచి, పాఠశాలల పురోభివృద్ధికి తోడ్పడేలా చూడాలని కేంద్ర విద్యాశాఖ అన్నిరాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ పథకం ద్వారా నిధులు అందే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాలు.. వర్చువల్ రియాలిటీ ద్వారా అవగాహన పీఎంశ్రీ పాఠశాలల డిజిటలైజేషన్లో భాగంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అన్నిప్రాంతాల నుంచి ఫ్యాకలీ్టని అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. దీనివల్ల గ్రామస్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలు అందుతాయని భావిస్తోంది. సైన్స్ సబ్జెక్టుల్లో ప్రయోగాలు, సోషల్‌లో భౌగోళిక స్థితిగతులు వర్చువల్ రియాలిటీలో విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు మొక్క ఆవిర్భావం దగ్గర్నుంచి, దాని ఎదుగుదల దశలను వర్చువల్ పద్ధతిలో విద్యార్థి క్లాస్‌రూం నుంచే తెలుసుకునే వెసులుబాటు కలి్పస్తారు. గ్రహాలు, సూర్య, చంద్రమండలాల్లో మార్పులను ఆధునిక సాంకేతికతతో అర్థమయ్యేలా చెబుతారు. రాష్ట్రం వాటా 40% పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయించనున్నాయి. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తూ, టీచర్లు తగిన నిష్పత్తిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 పాఠశాలలను వివిధ ప్రమాణాల ద్వారా గుర్తించారు. అయితే ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలు సాధిస్తున్న ప్రగతి, మెరుగైన ఫలితాల గురించిన పర్యవేక్షణ బాధ్యత మాత్రం కేంద్ర విద్యామంత్రిత్వశాఖదే. మూడు దశల్లో పాఠశాలల స్క్రీనింగ్ పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలను ఎంపిక చేయడానికి మూడు దశల స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. మొదటిదశలో స్కూల్లో టెన్త్, ఇతర క్లాసులకు సంబంధించిన కొన్నేళ్ల ఫలితాలు అప్లోడ్ చేశాం. పాఠశాలకు కావాల్సిన నిధులు, మౌలిక వసతుల గురించిన సమాచారారాన్ని యూడైస్ ద్వారా తెలిపాం. మొదటిదశలో మా స్కూల్ ఎంపికైంది. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించారు. మూడోదశలో జిల్లా అధికారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మా స్కూల్లో 580 మంది ఉన్నారు. గతేడాది 80 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్స్ గత నాలుగేళ్లల్లో 48 మందికి లభించాయి. పీఎంశ్రీ కింద భారీగా నిధులొస్తే స్కూల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుంది. ఫలితంగా ప్రతిభకు మరింత పదును పెట్టవచ్చు. – ఆకుల పద్మలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదు వేల పాఠశాలల వివరాలు పంపాం కేంద్రం తీసుకొస్తున్న పీఎంశ్రీ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకు తోడ్పడుతుంది. అనేక ప్రామాణిక అంశాల ఆధారంగా రాష్ట్రంలో 5 వేల పాఠశాలల వివరాలను అడిగారు. ఇవన్నీ పంపాం. 1,200 స్కూల్స్ పీఎంశ్రీ పరిధిలోకి వస్తాయని ఆశిస్తున్నాం. వీలైనంత త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందనే విశ్వాసం ఉంది. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
సరికొత్త బిహార్‌లో నితీశ్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువెళ్లడంలో బిహార్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సుపరిపాలనపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. సరికొత్త భారత్, సరికొత్త బిహార్ లక్ష్యంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సుపరిపాలన మరో అయిదేళ్ల పాటు కొనసాగాలన్నారు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలకి ప్రభుత్వ పథకాలతో ఎంత లబ్ధి చేకూరుతుందో గత 15 ఏళ్లుగా బిహార్‌వాసులకి తెలుస్తోందన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్రంలో రూ.900 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన మూడు పెట్రోలియం ప్రాజ్టెల్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పారాదీప్–హల్దియా–దుర్గాపూర్ పైప్‌లైన్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్టు, బంకా, చంపరాన్‌లో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) బాటిలింగ్ ప్లాంట్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని ఆ రాష్ట్ర ఎన్డీయే కూటమిలో చీలికలు వస్తున్నాయన్న ఊహాగా నాలకు తన ప్రసంగం ద్వారా చెక్ పెట్టారు. -
ప్రధాని మోదీ చరిష్మాపై ఆశలు!
సాక్షి, నల్లగొండ : ఇప్పటికి రెండుసార్లు ఊరించి ఉసూరుమనిపించిన విజయాన్ని ఈసారి ఎలాగైనా ఒడిసి పట్టాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ పార్టీ 1996, 2004 ఎన్నికల్లో రెండో స్థానంతో తృప్తి పడాల్సి వచ్చింది. కానీ, ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా విజయ తీరాలకు చేరాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు.. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మా తమను గట్టెక్కిస్తుందన్న భావనలో కమలనాథులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన బీజేపీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా అవే అంశాలను ప్రచారస్త్రాలుగా వాడుకుంటోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన గార్లపాటి జితేంద్రకుమార్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలిసే పనిలో ఉన్నారు. అభ్యర్థి గెలుపు కోసం ముఖ్య నాయకులను నియోజకవర్గంలో ప్రచారానికి తీసుకురానున్నారని చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఇప్పటికే ఖరారు అయ్యింది. ఏప్రిల్ ఆరో తేదీన ఉగాది రోజే అమిత్ షా నల్లగొండలో రోడ్ షోలో పాల్గొంటారని పార్టీ నాయకత్వం చెబుతోంది. అభ్యర్థి నామినేషన్ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నల్లగొండ పర్యటనకు రాగా, జాతీయ అధ్యక్షుడి పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. రెండు సార్లు తప్పిపోయిన విజయం జిల్లాలో తమకు పట్టుందని, దేశం మొత్తం నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కావాలనుకుంటోందని, ఈ కారణంగానే ఈసారి బీజేపీకి అవకాశం ఉందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇదివరకు రెండు పర్యాయాలు నల్లగొండ ఎంపీ స్థానంలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆ రెండు పర్యాయాలూ సీపీఐ చేతిలోనే ఓటమి పాలైంది. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్.ఇంద్రసేనారెడ్డి బరిలోకి దిగగా, సీపీఐ నుంచి బొమ్మగాని ధర్మబిక్షం పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో బీజేపీ 71,761 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అదే మాదిరిగా 2004 ఎన్నికల్లో సైతం బీజేపీ నుంచి ఎన్.ఇంద్రసేనారెడ్డి రెండోసారి పోటీ పడగా, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కూడా సీపీఐ విజయం సాధించగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ 56,151 ఓట్ల తేడాతో అవకాశం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తమకున్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత ఎన్నికల్లో అంచనాలు వేస్తోంది. దేశభద్రత, సంస్కరణలు, సంక్షేమ పథకాలు, ప్రధానిగా మోదీ పనితీరు, పుల్వామా సంఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు వంటిì అంశాలను తమకు అనుకూలంగా భావిస్తోందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం కోసం జరుగుతున్న ఎన్నికలకు పోలిక ఉండదని, అక్కడ ఎవరు ప్రధాని అవుతారు..? ఎవరి చేతిలో దేశ భద్రత భద్రంగా ఉంటుందన్న అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో తిష్ట వేసిన సమస్యలు, వాటి పరిష్కారం బీజేపీ ఎంపీలతోనే ఎలా సాధ్యమో ప్రచారం చేస్తోంది. మొత్తంగా అమిత్ షా పర్యటనతోపాటు, యువతలో మోదీకి ఉన్న చరిష్మా వంటి అంశాలతో తమ అభ్యర్థి గట్టెక్కుతారన్న విశ్వాసాన్ని బీజేపీ నాయకత్వం వ్యక్తపరుస్తోంది. -
వాడీవేడిగా..
సాక్షి, కొత్తగూడెం: ‘జిల్లాలో వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్క అధికారైనా సరైన ప్రతిపాదనలు పంపించారా..? ఇప్పటివరకు జిల్లాలో ఐదు సార్లు జరిగిన సమావేశాల్లో చెప్పినప్పటికీ ఉపయోగం లేదు. అధికారుల సహకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను ఎలా సాధించాలి?’ అంటూ మహబూబాబాద్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ అజ్మీరా సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కొత్తగూడెం డీఆర్డీఓ కార్యాలయంలో ‘దిశ’ (జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ) సమావేశం చైర్మన్ సీతారాంనాయక్, కో చైర్మన్ , ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పథకాలపై చర్చ జరిగింది. పనితీరు సక్రమంగా లేని, కాకిలెక్కలు చెప్పిన అధికారులపై ఎంపీలిద్దరూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని శాఖల వివరాలు, గణాంకాలను కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ నోటికి చెబుతుండగా, ఆయా శాఖల జిల్లా అధికారులు మాత్రం కాగితాలు వెతుక్కుంటుండగా.. ‘ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేందుకు సమావేశానికి వచ్చారా..? అసలు ప్రిపేర్ కాకుండా ఎలా వచ్చారు’ అని ఎంపీలు ప్రశ్నించారు. కొన్ని శాఖల నుంచి ద్వితీయ శ్రేణి అధికారులు సమావేశానికి రావడంతో సదరు శాఖాధిపతుల వివరాలను నోట్ చేసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాలకుప్రతిపాదనలు ఎందుకు పంపలేదు..? నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు, కొత్త అంబులెన్స్‌లకు ఇప్పటివరకు ప్రతిపాదనలు ఎందుకు పంపలేదని ఎంపీలు ప్రశ్నించారు. అధికారుల సహకారం లేకుంటే పార్లమెంట్లో ఎలా చర్చించాలన్నారు. 2013లో నిర్మాణం పూర్తిచేసుకున్న మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు సేవలు ప్రారంభించలేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. గతం దిశ సమావేశాల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని, అక్కడి డాక్టర్లందరినీ డిప్యుటేషన్‌పై ఎలా పంపారంటూ వైద్యవిధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రమేష్‌ను ప్రశ్నించారు. ఇల్లెందులోని 30 పడకల ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. కాగా ఈ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌కు మార్చాలని ఎంపీ సీతారాంనాయక్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపుతానని కలెక్టర్ తెలిపారు. భద్రాచలం, సారపాకలను అటూఇటూ కాకుండా ఎలా ఉంచారు..?: ఎంపీ సీతారాం నాయక్ భద్రాచలం, సారపాక పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు పంపించడంపై ఎంపీ సీతారాంనాయక్ నిర్వేదం వ్యక్తం చేశారు. పైనుంచి అడగకపోయినప్పటికీ ఈ ప్రతిపాదనలు పంపడమేమిటన్నారు. ఈ రెండు పట్టణాలు ఇటు గ్రామ పంచాయతీగా కాకుండా, అటు మున్సిపాలిటీగానూ కాకుండా ఉండటం వల్ల ప్రజలకు సరైన సేవలు అందే పరిస్థితి లేదన్నారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ షఫీఉల్లా సరైన వివరాలు చెప్పకపోవడంతో సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఎలా వచ్చావని ఎంపీ సీతారాంనాయక్ షఫీఉల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షయపాత్ర పథకం ఎవరికోసం పెట్టారు..? : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలు వ్యవహారాన్ని ‘అక్షయపాత్ర’ అనే సంస్థకు ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారని వనమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సదరు భోజనానికి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా నాణ్యత, పరిమాణంపై పరిశీలన చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను కూడా అటవీ శాఖాధికారులు లాక్కుని ఆదివాసీ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందించిన ఎంపీ సీతారాంనాయక్ బడాబడా స్మగ్లర్లను వదిలిపెట్టి అమాయక ఆదివాసీలపై అటవీ అధికారులు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు జులూం వల్ల ఆదివాసీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారులు నిర్లక్ష్యం వీడాలి: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గుండాల మండలం సజ్జలగూడెం వద్ద విద్యుత్ తీగలు తెగిపడటంతో 6వ తరగతి విద్యార్థిని మృతి చెందిందని, కొన్ని పశువులు మృతిచెందాయన్నారు. కరకగూడెం మండలంలో ఊరి బయట నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌ను మార్చి ఇళ్ల మధ్యనుంచి వేయడమేమిటని ప్రశ్నించారు. గుండాలలో ఇందిర జలప్రభపథకం కింద 9 బోర్లు వేయగా, ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యుత్ సరఫరా చేయకుండా ఆ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులపై.. మిషన్ భగీరథ పథకం పనులకు సంబంధించి ఆ శాఖాధికారులు కాకిలెక్కలు చెప్పడంతో ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆయా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంపట్ల కాంట్రాక్టర్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారని, వారేమైనా మీకు చుట్టాలా.. బం«ధువులా..? అంటూ ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్‌పార్టీ విచారణ జరిపి, తమకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఇల్లెందుకు గతంలో నడిచిన ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరగా, స్పందించిన సీతారాంనాయక్ ఈ విషయంతోపాటు సారపాక రైల్వేలైన్ విషయంపై కూడా కేంద్ర మంత్రితో మాట్లాడతానన్నారు. జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, గుండాల, ములకలపల్లి, ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలాలకు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేశానని సీతారాంనాయక్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100 మంది విద్యార్థులతో వీటిని ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు పే ర్కొన్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పట్టణంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం మంజూరైందని, త్వరలో కొత్తగూ డెం పట్టణంలో కూడా పాస్‌పోర్ట్ కేంద్రం మంజూరు చేసే విధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డీఎంఎఫ్ నిధులను ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారు..? ఎంపీ పొంగులేటి సింగరేణి గనులు విస్తరించి ఉన్న కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలకు సంబంధించి వచ్చిన రూ.441 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను ఏ విధంగా కేటాయించారని డీఆర్డీవో జగత్‌కుమార్ రెడ్డిని ఎంపీ పొంగులేటి ప్రశ్నించారు. ఇప్పటివరకు కొత్తగూడెం నియోజకవర్గానికి రూ.95 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గానికి రూ.71.90 కోట్లు, పినపాక నియోజకవర్గానికి రూ.21.80 కోట్లు కేటాయించినట్లు డీఆర్డీవో తెలిపారు. తాము ఇద్దరం ఎంపీలము ఇచ్చిన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారని పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి చర్చించాలని నిర్ణయించారు. -
కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
తిర్యాణి(ఆసిఫాబాద్) : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని జీవణ ప్రమాణాలు పెంపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రచారశాఖ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాలతో ప్రజలు లబ్ధిపొందాలన్నారు. ప్రజలకు పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో మరింత అవగాహన కల్పించడానికి ప్రచార మంత్రిత్వశాఖ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష యోజన, జీవన జ్యోతి బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, స్వచ్ఛభారత్ అభియాన్, బేటీ పడావో, బేటీ బచావో, ముద్రయోజన, కౌషల్ యోజన, పంటల బీమా యోజన, ఆయుష్మాన్‌భవ యోజన, ఉజ్వల యోజన పథకాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు ప్రజాప్రతినిధులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. రోడ్లు శుభ్రం చేశారు. సమావేశంలో ఎంపీపీ హన్మాండ్ల లక్ష్మి, సీడీపీవో సావిత్రి, ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో శంకర్, టీఆర్ఎస్ నాయకులు పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. చింతలమానెపల్లి(సిర్పూర్): కేంద్ర ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని రుద్రపూర్ గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి సుదర్శన్ రెడ్డి, డీఎల్ఎం రామయ్య, డీపీవో గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలకు తగ్గిన బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే పథకాలకు బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే ఈసారి తగ్గాయి. కేంద్ర పథకాలకు ఈ బడ్జెట్లో మొత్తం రూ.1,876 కోట్లను కేటాయించింది. ముఖ్యంగా సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,175 కోట్లు కేటాయించగా, 2018–19 బడ్జెట్లో రూ.1,058 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే రూ.117 కోట్ల మేర కేటాయింపులను ఈ ఏడాది తగ్గించింది. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మధ్యాహ్న భోజనం, వయోజన విద్య, ఇతర విద్యా కార్యక్రమాల కింద రూ.818 కోట్లను కేటాయించింది. కంప్యూటర్ విద్య, డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాలకు అరకొర కేటాయింపులతో సరిపుచ్చింది. పాలిటెక్నిక్‌లలో ప్రత్యామ్నాయ విద్యా బోధనకు నిధులను కేటాయించలేదు. -
ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది: యనమల
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలిపిందని, విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90:10 శాతంగా ఇస్తామని కేంద్రం చెప్పడంతో ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. -
900/8000
ఇవి విద్యుత్‌శాఖకు లబ్ధిదారులు ఇచ్చిన మార్కులు. కరెంటోళ్లకు వీరు మార్కులివ్వడమేంటి? ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలిగానీ అని అనుకుంటున్నారా? అవును మరి. విద్యుత్ మీటర్ల కోసం ఏడాది క్రితం 8 వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా 900 అమర్చారు. అందుకే ఈ మార్కులిచ్చారు. అశ్వాపురం : ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం(డీడీయూజీజేవై) జిల్లాలో నత్తనకడన సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ తీసుకోలేక, చీకట్లో మగ్గుతున్న నిరుపేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. తెల్లరేషన్‌కార్డు కలిగిన పేదలు తమకు విద్యుత్ కనెక్షన్ లేదని పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణపత్రంతో విద్యుత్ శాఖ అధికారులకు రూ.125 డీడీ సమర్పించాలి. వారు సర్వీస్‌వైరు, రెండు ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ మీటరును అమరుస్తారు. ఇంటికి సమీపంలో స్తంభాలు లేకపోతే కొత్తగా వేస్తారు. గతంలో విద్యుత్ మీటర్లకు డీడీలు చెల్లిస్తే సర్వీస్‌వైరు, ఇతర ఖర్చులు యజమానే భరించేవాడు. ఈ పథకంలో ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో అర్హులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 8 వేల దరఖాస్తులొస్తే 900 మీటర్లు అమర్చారు డీడీయూజీజేవై పథకం కింద జిల్లాలో 8 వేల మంది విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 2017లో ఈ పథకం ప్రారంభమైంది. ఏడాది గడుస్తున్నా 900 మందికి మించి విద్యుత్ మీటర్లు అందివ్వలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, మీటర్లు, సర్వీస్‌వైరు సామగ్రి అందుబాటులో లేకపోవడంతో పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంవత్సర కాలంగా ఇబ్బందులు విద్యుత్ మీటర్ల కోసం నిరుపేదలు గత మార్చిలో దరఖాస్తు చేసుకున్నారు. ఏడా దికాలంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు ఇవ్వలేదు. దీంతో చీకట్లోనే మగ్గుతున్నారు. కొందరు డీడీలు కట్టామని అనధికాకరికంగా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. తనిఖీలకు వచ్చిన విద్యు త్ విజిలెన్స్ అధికారులేమో విద్యుత్ చౌర్యమంటూ జరిమానాలు విధిస్తున్నారు. కే సులు నమోదు చేస్తున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకంలో విద్యుత్ మీటర్లు అమర్చాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మార్చిలోగా పూర్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీ ణ విద్యుదీకరణ యోజన పథకానికి జిల్లా లో 8 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 900 మీటర్లు అమర్చాం. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మీటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఆలస్యమయింది. ఇటీవల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాం. వారం రోజుల్లో మీటర్లు అమర్చే ప్రక్రియ వేగవంతం చేస్తాం. మార్చి నెలలోపు దరఖాస్తుదారులందరికి మీటర్లు అమరుస్తాం. –ఏ.సురేందర్, ఎస్ఈ, టీఎస్ ఎన్పీడీసీఎల్, కొత్తగూడెం -
సివిల్స్ ప్రిలిమ్స్‌లో కేంద్ర పథకాలు
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పలు పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. వస్తుసేవల చట్టం(జీఎస్టీ)తో పాటు బినామీ ఆస్తులు, వ్యవహారాల చట్టం 1988, విద్యాంజలి యోజన, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్) పథకాలపై ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అడిగారు. ప్రిలిమ్స్‌లో భాగంగా పేపర్–1 పరీక్షను ఉదయం 9.30కు, పేపర్–2 పరీక్షను మధ్యాహ్నం 2.30కు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం ఎంత మంది హాజరయ్యారో యూపీఎస్సీ స్పష్టం చేయలేదు. -
నేటి నుంచి ఇంటింటికీ బీజేపీ
- అన్ని పోలింగ్ బూత్‌లు చుట్టివచ్చేలా కార్యక్రమం - కేంద్ర పథకాలు, టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రచారం సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ తిరిగి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌లను చుట్టి వచ్చేలా రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్ర మానికి సోమవారం నుంచి బీజేపీ శ్రీకారం చుడుతోంది. మే 29 నుంచి జూన్ 12 తేదీల మధ్యలో రాష్ట్రంలోని మొత్తం 32 వేల పోలింగ్ బూత్‌లలో అత్యధికశాతం చేరుకు నేలా 8 వేల మంది నాయకులు, కార్యకర్తల ను పార్టీ సిద్ధం చేసింది. ఒక్కొక్కరు 4 నుంచి 6 పోలింగ్ బూత్‌లకు వెళ్లేలా ఈ కార్యక్ర మాన్ని రూపొందించారు. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయం తి ఉత్సవాల్లో భాగంగా పార్టీ పటిష్టతకు ఉద్దేశించిన కార్యనిర్వాహక్ యోజనలో భాగంగా దీనిని చేపడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని మండల పార్టీ అధ్యక్షుడి వరకు 15 రోజుల పాటు ఇంటిని వదలి, తమకు కేటాయించిన గ్రామాల్లో పోలింగ్ బూత్ స్థాయిల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులను ఎంపిక చేసి, వారంతా వారంరోజులు ఒక జిల్లాలో, మరో వారంరోజులు మరో జిల్లాలో అంటే ఒక్కో నాయకుడు రెండు జిల్లాలను పర్యవేక్షించేలా కార్యక్రమాన్ని రూపొందిం చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై నాలుగు రకాల కరపత్రాల ద్వారా బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. కాగా, పోలింగ్ బూత్‌స్థాయిలో ఇంటింటికి వెళ్లిన సందర్భంగా రాజకీయంగా, సామాజికపరంగా ప్రభావం చూపే వారు, ఇతర పార్టీల నాయకుల వివరాలు, కులాలు, మతాల వారీగా ఓట్ల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి దానిని ఒకచోట క్రోడీకరించనున్నారు. -
ఈసారి కొత్తగా మరో 84 కేజీబీవీలు
- బాలుర కోసం 29 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు - కేంద్ర పథకాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నివాస వసతితో కూడిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) 391 ఉండగా, వచ్చే జూన్ నుంచి మరో 84 కేజీబీవీలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏ బీ) వీటికి ఓకే చెప్పింది. వాటిని వచ్చే జూన్ నుంచే ప్రారంభించాలని మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ సహకార పథకాలపై జరిగిన సమీక్షలో నిర్ణయించారు. వీటితోపాటు బాలుర కోసం కూడా మరో 29 కస్తూర్బా గాంధీ విద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించారు. వాటిలో 6, 7, 8 తరగతుల్లో బోధన ప్రారంభిస్తారు. ఒక్కో పాఠశా లలో ఇందుకుగాను 600 మందికి పైగా బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులను వెంటవెంటనే రాబట్టుకునే ప్రయత్నాలు చేయాలని, వాటిని సకాలంలో ఖర్చు చేసి వి నియోగ పత్రాలు సమర్పిం చాలని కడియం శ్రీహరి సూచించారు. ప్రస్తుతం ఉన్న కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫర్నిచర్, బెడ్ మెటీరియల్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రొడక్టు కిట్లను విద్యార్థులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన 84 మండలాల్లో కేజీబీవీల ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని, బాలుర కోసం కూడా 29 జిల్లా కేంద్రాల్లో బాలుర స్కూళ్లను ప్రారంభిం చాలన్నారు. వీటి ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని కోరామని, వారు సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ –2 కింద కొనసాగుతున్న పనులను ఈ ఏడాది జూన్ నెలాఖరు లోగా, ఆర్‌ఎంఎస్‌ఏ–3 కింద కొనసాగుతున్న పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. మరో 6 వేల పాఠశాలల్లో బయోమెట్రిక్ ఈసారి దాదాపు 6 వేల విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరును అమలు చేస్తామని కడియం చెప్పారు. స్కూళ్లలో టాయిలెట్లకు రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. టాయిలెట్ల నిర్వహణకు ఒక వర్కర్‌ను పెట్టుకునేందుకు ప్రత్యేకంగా రూ. 20 వేలు ఇస్తున్నామని, వంద నుంచి 300 లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఇద్దరిని నియమిం చేందుకు, నిర్వహణకు రూ. 50 వేలను ఇస్తామన్నారు. 500 కంటే ఎక్కువ మంది ఉ చోట ముగ్గురు వర్కర్లను పెట్టుకోవాలని, వాటికి రూ. 75 వేలు ఇస్తామని, పాఠశాలలు ప్రారంభయ్యే నాటికే తొలి ఇన్స్టాల్మెంట్ ఇస్తామన్నారు. కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్పీల వేతనాలు పెంపు యోచన ఉందనీ అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. -
తెలంగాణలో గెలిచే అవకాశం
గుర్తించిన బీజేపీ జాతీయ నాయకత్వం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలిచే అవకాశం ఉందని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించింది. పార్టీ బలంగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లను గెలుచుకున్నందున.. 2019 ఎన్నికల్లో ఆ స్థాయిలో సీట్లు రాకున్నా మిగతా రాష్ట్రాల నుంచి ఆ సంఖ్యను భర్తీ చేసేందుకు అధినాయకత్వం కార్యాచరణను రూపొం ది స్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి నిలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కార్యక్రమాల నిర్వహణ, సన్నద్ధత, రాష్ట్రస్థాయి నుంచి బూత్‌స్థాయి వరకు ఉన్న స్థితిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ బుధవారం నుంచి క్షేత్రస్థాయి పరి శీలన మొదలుపెట్టారు. గురువారం జిల్లాల్లో పర్యటించి, శుక్రవారం మళ్లీ పార్టీ ముఖ్యులతో భేటీ కానున్నారు. త్వరలో అమిత్‌షాకు రాష్ర్టంలో పార్టీ పరిస్థితిపై నివేదికను సమర్పిస్తారు. అధికార మే లక్ష్యంగా పనిచేయాలి.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడ మే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ర్ట పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి జాతీయపార్టీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తెలంగాణతో సహా 7 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణానికి, బలోపేతానికి, పార్టీని ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చేందుకు జాతీయపార్టీ ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నదన్నారు. కేంద్ర పథకాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, కేంద్రం అందిస్తున్న సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలియజేయడం లేదని విమర్శించారు. -
కేంద్ర పథకాలను బాబు హైజాక్
అంగర(కపిలేశ్వరపురం): కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పలు పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైజాక్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్రనేతలు ఆరోపించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు, ఆర్వీ నాయుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోన సత్యనారాయణ , జిల్లా కమిటీ సభ్యుడు బండారు సూరిబాబు శుక్రవారం అంగరలో విలేకరుల సమావేశంలో ఆవివరాలను తెలియజేశారు. ప్రధాని మోదీ స్వచ్చభారత్ అంటే సీఎం చంద్రబాబునాయుడు స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ అంటూ కార్యక్రమాలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్ఆర్ఈజీఎస్, 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినవాటిగా ప్రచారం చేస్తున్నారన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు వేటికీ స్థానిక బీజేపీ నేతలను కనీసం పిలవడం కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బీజేపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే వైఖరిని అవలంబిస్తే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. మండల స్థాయి నాయకులు ఎం.వీర్రాజు చౌదరి, ఎం.పుల్లయ్య చౌదరి, నంబుల వెంకన్న పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలు తడిసి మోపెడు!
► ఇప్పటివరకు కేంద్రం నుంచి 75-90 శాతం నిధులు ► ఇకపై ఇచ్చేది 60 శాతమే ► రెట్టింపైన విద్యాశాఖ ప్రణాళిక బడ్జెట్ ► మొత్తంగా రూ.14,124 కోట్లు కావాలని ప్రతిపాదనలు! ► మోడల్ స్కూళ్ల భారం పూర్తిగా రాష్ట్రంపైనే సాక్షి, హైదరాబాద్: కేంద్ర పథకాల భారం ఈసారి రాష్ట్రంపై భారీగా పెరగనుంది. దీంతో పాఠశాల విద్యాశాఖకు ప్రణాళిక బడ్జెట్ కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తాన్ని వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటివరకు కొన్ని పథకాల్లో 90 శాతం నిధులను ఇస్తుండగా.. మరికొన్నింటికి 75 శాతం నిధులను ఇస్తోంది. కానీ ఇకపై కేంద్రం 60 శాతం నిధులే ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే 40 శాతం నిధులను వెచ్చించాల్సి ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్థిక శాఖకు పంపేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తంగా పాఠశాల విద్యకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,124 కోట్లు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో ప్రణాళిక బడ్జెట్ కింద రెట్టింపు నిధులు అవసరమని ప్రతిపాదించింది. గతేడాది ప్రణాళిక బడ్జెట్ కింద రూ.1,854 కోట్లు ప్రతిపాదించిన విద్యాశాఖ ఈసారి రూ.3,591 కోట్లు కావాలని పేర్కొంది. మరోవైపు వేతనాలు, ఇతర నిర్వహణ వ్యయం కింద కేటాయించే నాన్ ప్లాన్ బడ్జెట్ గత ఏడాది రూ.9,111 కోట్లు ఉండగా ఈసారి రూ.10,533 కోట్లు అవసరమని పేర్కొంది. పదో పీఆర్సీ కింద పెరిగిన వేతనాలు, డీఏ తదితర ఖర్చులు పెరగడంతో నాన్ ప్లాన్ బడ్జెట్ కింద ఎక్కువ కేటాయింపు అవసరమని పేర్కొంది. రాష్ట్రంపై తప్పని భారం: మోడల్ స్కూళ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఇప్పటివరకు ప్రారంభించిన స్కూళ్లు, వాటి నిర్వహణ వేల మంది టీచర్ల జీతభత్యాలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. మరోవైపు సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర పథకాలకు కేంద్ర ప్రభుత్వం తమ వాటాను తగ్గించడంతో గత ఏడాది కంటే ఈసారి అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు గురుకుల విద్యాలయాలకు అదనంగా భవన నిర్మాణాలు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి పనులకు అదనపు నిధులు కావాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు కేజీ టు పీజీ కింద టోకెన్ అమౌంట్‌గా రూ.75 కోట్లు ప్రతిపాదించినా ప్రభుత్వం ఈసారి దీనికి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పాఠశాల విద్య ప్రతిపాదించిన బడ్జెట్ ఇదీ..(రూ.కోట్లలో) మొత్తం బడ్జెట్ 14,124 ప్రణాళిక 3,591 నాన్ ప్లాన్ 10,533 ఇందులో దేనికెంత..? కేంద్ర రాష్ట్ర భాగస్వామ్య పథకాలకు 2,177 కిచెన్ షెడ్లకు 162 కేజీ టు పీజీ టోకెన్ అమౌంట్ 75 గత ఏడాది ఇలా..(రూ.కోట్లలో) మొత్తం బడ్జెట్ 10,965 ప్రణాళిక పద్దు 1,854 ప్రణాళికేతర పద్దు 9,111 -
కేంద్ర పథకాలు అమలు చేస్తా...
ఎంపీ అశోక్‌కుమార్ హొసూరు : క్రిష్ణగిరి లోకసభ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి పథకాలను తీసుకొస్తానని ఎంపీ అశోక్‌కుమార్ తెలిపారు. ఉచిత మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్లను హొసూరు మున్సిపాలిటీలో లబ్ధిదారులకు అందజేసిన కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రిష్ణగిరి మీదుగా జోలార్పేటకు హొసూరు నుంచి రైలు మార్గం ఏర్పాటు విషయంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలోని ఏడవ జాతీయ రహదారిపై వంతెనలు ఏర్పాటు విషయంపై అధికారులతో చర్చిస్తున్నామని, ఆరులైన్ల జాతీయ రహదారిపై గ్రామాల వద్దబస్సు షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. హొసూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయింపజేశానని, హొసూరు-తళి రోడ్డులో రైల్వేక్రాసింగ్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు విషయం పార్లమెంట్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జిల్లాలో హొసూరు, డెంకణీకోట, క్రిష్ణగిరి తాలూకాలలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరడంలేదని, ఈ ప్రాంతాలలో తెలుగు, కన్నడ భాషా ప్రజలకు తమిళంలో ప్రభుత్వ సమాచారం చేరవేయడంతో ప్రజలు లబ్దిపొందలేదని విలేకరులు సూచించగా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించి తెలుగు, కన్నడంలో వివరాలను తెలిపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.బస్సులలో, కార్యాలయాలలో తెలుగు బోర్డులు ఏర్పాటు విషయం జిల్లా ఇన్చార్జ్ మంత్రితో చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చెరువులలో పూడిక తీసే విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకాన్ని అమలు చేస్తున్నారని, ఆ పథకం అమలు జరుగుతుందని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రాము, యూనియన్ చైర్పర్సన్ పుష్పాసర్వేశ్, అన్నాడీఎంకే కార్యదర్శి నారాయణ, నాయకులు రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల ఐక్యతతోనే దేశాభివృద్ధి
ప్రధాని మోడీ వెల్లడి.. యూపీఏ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు అందువల్లే నీరుగారిన కేంద్ర పథకాలు రైతు జేబు నిండితేనే దేశ ఖజానా భర్తీ వారికి అనుకూలమైన పథకాలు రూపొందించాలి తుమకూరు : దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం భుజం కలిపి ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఉద్బోధించారు. ఇక్కడికి సమీపంలోని వసంత నరసాపురంలో బుధవారం ఆయన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, అంతకు ముందు సాగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగంపై స్పందించారు. తనకు కన్నడం తెలియకపోయినా భావాన్ని అర్థం చేసుకోగలనని అన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలుండేవని చెప్పారు. దీని వల్ల కేంద్ర పథకాలు సద్వినియోగం కాకుండా అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. కేంద్రంలో తాము అధికారం చేపట్టాక అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కాగా రైతు దేశానికి అంతా ఇస్తున్నా, అతని జేబు మాత్రం ఖాళీగానే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల జేబులు నిండితే ఖజానా భర్తీ అవుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ భారత్‌కు కొత్తేమీ కాదని, ప్రాచీన కాలం నుంచే దీనికి ప్రాధాన్యత ఉందని అన్నారు. పాలు చెడిపోకుండా చూడడానికి మహిళలు దాని నుంచి నెయ్యి తీసేవారని గుర్తు చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ భాగస్వామ్యంలో నెలకొల్పామని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తుందని వెల్లడించారు. ఆదివాసీలు... లేజర్ టెక్నాలజీ తాను గతంలో ఓ సారి ఆదివాసీలు ఉండే చోటికి వెళ్లానని ప్రధాని తెలిపారు. అక్కడ ప్రతి పుష్పగుచ్ఛంలోనూ తన చిత్రం ఉండడాన్ని చూసి, ఇదెలా సాధ్యమైందని వారిని అడిగానని చెప్పారు. లేజర్ టెక్నాలజీ ద్వారా ఫొటోలను అందులో ఇమిడ్చామని చెప్పారని వెల్లడించారు. అంతేకాకుండా గతంలో రూ.2కు కూడా వీటిని అడిగే వారు లేరని, ఫొటోను అమర్చాక రూ.200కు అమ్ముతున్నామని వారు చెప్పారని వివరించారు. కనుక రైతులకు అనుకూలమైన టెక్నాలజీని, పథకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం నినాదాలతో దేశాన్ని అభివృద్ధి పరచలేమని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. 30 శాతం ఉత్పత్తుల నష్టం వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు సరైన సదుపాయాలు లేని కారణంగా సుమారు 30 శాతం నాశనమవుతున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్‌కు సరైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఫుడ్ పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో వైవిధ్యమైన వాతావరణం ఉంటుందని, వ్యవసాయ ఉత్పత్తులూ అలాగే ఉంటాయని తెలిపారు. రాష్ట్ర రైతులకు న్యాయమైన ధరలు లభించడం లేదని, కనుక ఇలాంటి అనేక ఫుడ్ పార్కులను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రైతులకు న్యాయమైన ధర లభించాలంటే, ముందుగా వ్యవసాయ ఉత్పత్తుల విలువను లెక్క కట్టాల్సి ఉందని తెలిపారు. ఈ పార్కు వల్ల అనేక జిల్లాలకు చెందిన రైతులకు మేలు చేకూరుతుందన్నారు. తాము కొత్తగా తీసుకు రాబోయే పారిశ్రామిక విధానంలో పరిశ్రమల ఏర్పాటు ఏ కారణంతో కూడా ఆలస్యం కారాదని పేర్కొంటున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీని కర్ణాటకకు కూడా విస్తరించాలని కోరారు. లేనట్లయితే ఆంధ్రప్రదేశ్‌తో అనారోగ్యకరమైన పోటీ ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వజూభాయ్ వాలా, కేంద్ర మంత్రులు డీవీ సదానంద గౌడ, అనంత కుమార్, హర్షిత్ కౌర్ బాదల్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టీబీ జయచంద్ర, స్థానిక ఎంపీ ముద్ద హనుమేగౌడ ప్రభృతులు పాల్గొన్నారు.