సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే పథకాలకు బడ్జెట్ కేటాయింపులు గతేడాది కంటే ఈసారి తగ్గాయి. కేంద్ర పథకాలకు ఈ బడ్జెట్‌లో మొత్తం రూ.1,876 కోట్లను కేటాయించింది. ముఖ్యంగా సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,175 కోట్లు కేటాయించగా, 2018–19 బడ్జెట్‌లో రూ.1,058 కోట్లు మాత్రమే కేటాయించింది.
అంటే రూ.117 కోట్ల మేర కేటాయింపులను ఈ ఏడాది తగ్గించింది. అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), మధ్యాహ్న భోజనం, వయోజన విద్య, ఇతర విద్యా కార్యక్రమాల కింద రూ.818 కోట్లను కేటాయించింది. కంప్యూటర్ విద్య, డిజిటలైజేషన్ వంటి కార్యక్రమాలకు అరకొర కేటాయింపులతో సరిపుచ్చింది. పాలిటెక్నిక్‌లలో ప్రత్యామ్నాయ విద్యా బోధనకు నిధులను కేటాయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment