సివిల్స్ ప్రిలిమ్స్‌లో కేంద్ర పథకాలు
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పలు పథకాలపై ప్రశ్నలు వచ్చాయి. వస్తుసేవల చట్టం(జీఎస్టీ)తో పాటు బినామీ ఆస్తులు, వ్యవహారాల చట్టం 1988, విద్యాంజలి యోజన, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఎస్‌క్యూఎఫ్) పథకాలపై ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అడిగారు. ప్రిలిమ్స్‌లో భాగంగా పేపర్–1 పరీక్షను ఉదయం 9.30కు, పేపర్–2 పరీక్షను మధ్యాహ్నం 2.30కు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం ఎంత మంది హాజరయ్యారో యూపీఎస్సీ స్పష్టం చేయలేదు.